కూతురే కొడుకయ్యింది ! | Daughter Compleats Father Funeral Programme In Guntur | Sakshi
Sakshi News home page

కూతురే కొడుకయ్యింది !

Published Tue, Oct 23 2018 1:56 PM | Last Updated on Tue, Oct 23 2018 1:56 PM

Daughter Compleats Father Funeral Programme In Guntur - Sakshi

తల్లికి అంత్యక్రియలు చేస్తున్న మూడవ కుమార్తె పార్వతి

గుంటూరు, తాడేపల్లిరూరల్‌: కూతుళ్లే కొడుకులయ్యారు.. కన్నవారికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకున్నారు. పున్నామనరకం నుంచి కాపాడే పుత్రుడు ఫోనెత్తకపోవడంతో కనిపెంచిన తల్లిదండ్రులకు కూతుళ్లే కడసారి వీడ్కోలు పలికారు. వివరాల్లోకి వెళ్లితే.. సీతానగరంలో నివాసం ఉండే  పేద కుటుంబం పారేపల్లి నారాయణ, సరోజిని దంపతులకు ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు పదేళ్ల కిందట వివాహం చేసుకొని వేరే ఊరు వెళ్లిపోయాడు. పెద్దకూతురుకు, చిన్నకూతురుకు వివాహమైంది.

రెండవ కూతురు, మూడవ కూతురు తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తల్లి సరోజిని మృతి చెందడంతో మూడవ కూమార్తె పార్వతి అంత్యక్రియలను నిర్వహించింది. 2011లో తండ్రి నారాయణ మరణించినప్పుడు రెండవ కూతురు దేవి తలకొరివి పెట్టగా, ప్రస్తుతం తల్లికి మూడవ కూతురు అంత్యక్రియలు చేసింది. ఉన్న ఒక్క కుమారుడు ఫోన్‌లో స్పందించకపోవడంతో కూతుళ్లే తలకొరివి పెట్టారని, సమాజంలో తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునేది కూతుళ్లేనని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement