ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం బుధవారం తలపెట్టిన సకలజనుల సమరభేరి సభకు వెళ్లి మృతి చెందిన డ్రైవర్ నంగునూరి బాబు అంత్యక్రియలపై ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని గురువారం మృతుడి కుటుంబ సభ్యులతో పాటు ఆర్టీసీ కార్మికులు బైఠాయించారు. మృతుడి ఇంటివద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులను అరెస్ట్ చేయడంతో.. జిల్లాలోని ఆరెపల్లి గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.