Australian Airlines Asks Isabelle Eleanore Instagram Model to 'Cover Up' As Her Top - Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాగ్రామ్ మోడల్‌కు చేదు అనుభవం

Published Sat, Feb 6 2021 12:43 PM | Last Updated on Sat, Feb 6 2021 3:25 PM

Airlines Asks Instagram Model to Cover Up as Her Top was Too Small - Sakshi

మెల్‌బోర్న్ : పొట్టి దుస్తులు ధరించిన కారణంగా ఓ మోడల్‌కు చేదు అనుభవం ఎదురైంది. డ్రెస్‌ కారణంగా సిబ్బంది ఆమెను విమానంలోకి అనుమతించలేదు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఇసాబెల్లే ఎలెనార్ అనే ఇన్‌స్టాగ్రామ్ మోడల్  జెట్‌స్టార్‌ అనే ఎయిర్‌లైన్స్‌లో గోల్డ్ కోస్ట్ నుంచి మెల్‌బోర్న్‌కు బయలుదేరింది. అయితే ఆమె వేసుకున్న టాప్‌ మరీ చిన్నదిగా ఉండటంతో సిబ్బంది ఆమెను  విమానం ఎక్కనివ్వలేదు. ఆ సమయంలో మోడల్‌ బ్లూ జీన్స్, బ్లాక్‌ క్రాప్ టాప్ ధరించి ఉంది. అయితే టాప్‌ మరీ చిన్నదిగా ఉందని, ఓవర్‌ కోట్‌ ధరించాలని సూచించారు. లేదంటే విమానంలోకి అనుమతించమని సిబ్బంది తెగేసి చెప్పడంతో ఇక చేసేదేమీ లేక జాకెట్‌ను ధరించింది. ఈ విషయంపై తన  ఫేస్‌బుక్‌ పేజీలో ఆవేదనను వ్యక్తం చేసింది.  (రైతులకు మద్దతు.. నటికి అత్యాచార బెదిరింపులు)

'నేను విమానంలోకి అడుగుపెట్టగానే, అక్కడి సిబ్బంది ఏదో వెతకడం​ ప్రారంభించాడు. నా డ్రెస్‌ చూసి నన్ను జాకెట్‌ వేసుకోమని చెప్పినప్పుడు చలిగా ఉంటుందని అలా అన్నారేమో అనుకున్నా. కానీ నా టాప్‌ చిన్నగా ఉండటం వల్ల నన్ను విమానంలోకి ఎక్కించలేదమని చెప్పిన్పపుడు చాలా బాధేసింది. జాకెట్‌ వేసుకునేంత వరకు సీట్లోకి కూర్చోనివ్వలేదు. నేను ఒక మోడల్‌ని. అంత మంది ప్రయాణికుల ముందు నన్ను అవమానించారు. నాపై వివక్ష చూపించారు. జెట్ స్టార్ ఆస్ట్రేలియా..ఇది 1921 ఆ లే​క 2021' ?అని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. (ఫోటో గ్రాఫర్‌ ఓవరాక్షన్‌.. వరుడి రియాక్షన్‌: వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement