ప్రతీకాత్మకచిత్రం
బెంగళూర్ : మోడల్‌ను హత్య చేసిన కేసులో 22 సంవత్సరాల ఓలా క్యాబ్ డ్రైవర్‌ను బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాబ్ డ్రైవర్ నాగేష్ కోల్‌కతాకు చెందిన మోడల్‌ను విమానాశ్రయంలో దిగబెడుతూ అత్యంత కిరాకతంగా హతమార్చాడు. నగరంలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జులై 31న ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. బాధితురాలిని 32 ఏళ్ల మోడల్, ఈవెంట్ మేనేజర్ పూజా సింగ్ దేగా గుర్తించారు. మోడల్ పూజాను విమానాశ్రయానికి తీసుకువెళ్లాల్సిన డ్రైవర్ నాగేష్ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తరలించి విలువైన వస్తువులను దొంగిలించి కిరాతకంగా హతమార్చాడని పోలీసులు తెలిపారు.
బాధితురాలి నుంచి నగదు, మొబైల్ ఫోన్‌ను లాక్కున్న నిందితుడు ఆమె తలపై బలంగా కొట్టడంతో ఘటనా ప్రదేశంలోనే మరణించిందని చెప్పారు. బాధితురాలిని హత్య చేసిన నిందితుడు ఏకంగా ఆమె ఫోన్ నుంచే పూజ భర్తకు ఫోన్ చేసి రూ 5 లక్షలు డిమాండ్ చేశాడని వెల్లడించారు. బాధితురాలి శరీరంపై పలుచోట్ల కత్తి గాట్లు, తలపై బలమైన గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. బాధితురాలు జులై 30న ఓ ఈవెంట్ కోసం బెంగళూర్‌కు వచ్చి తిరిగి పశ్చిమ బెంగాల్ వెళతుండగా ఈ హత్య జరిగిందని తెలిపారు. పూజ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్యాబ్ డ్రైవర్ ఘాతుకం వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment