ముంబై : మోడల్‌పై దాడి చేయటమే కాకుండా అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు పాల్పడ్డాడో వ్యాపారి. పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను బలవంతపెడుతూ చివరకు జైలు పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన రామ్‌కుమార్ కురుప్పుసామి అనే వస్త్ర వ్యాపారికి 2014లో ముంబైకి చెందిన ఓ మోడల్‌తో పరిచయం ఏర్పడింది. వస్త్ర వ్యాపారానికి సంబంధించిన అడ్వర్‌టైజ్‌మెంట్ నిమిత్తం ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. తరుచుగా వాట్సాప్‌లో చాటింగులు కూడా చేసుకున్నారు. 2015లో తనకో ఆధ్యాత్మిక గురువు తెలుసని, అతడి వద్ద పూజలు చేయిస్తే మంచి భవిష్యత్తుతో పాటు మోడలింగ్‌లో అవకాశాలు పెరుగుతాయని రామ్‌కుమార్ ఆమెను నమ్మించాడు. ఇందుకు గానూ రూ. 8 లక్షలు మోడల్ వద్దనుంచి తీసుకున్నాడు.
ఆ తర్వాత ఆధ్యాత్మిక గురువు దగ్గరకు తీసుకెళ్లి ఆమెతో పూజలు చేయించాడు. అయితే రోజులు గడుస్తున్నా అవకాశాల విషయంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో తన డబ్బు తిరిగివ్వాలని మోడల్ అతడిని కోరింది. కొద్దిరోజుల తర్వాత రామ్‌కుమార్ ఆమెకు డబ్బు తిరిగిచ్చేశాడు. ఆ తర్వాతి నుంచి పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను వేధించటం మొదలుపెట్టాడు. ఆమెపై చేయి చేసుకోవటమే కాకుండా వాట్సాప్‌కు అసభ్యకర సందేశాలు పంపుతూ ఇబ్బంది పెట్టేవాడు. అతడి వేధింపులకు తాళలేకపోయిన మోడల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోడల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విదేశాలకు వెళుతున్న రామ్‌కుమార్‌ను శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment