APPSC 2022: Free Model Interviews For Group 1 Mains Candidates - Sakshi
Sakshi News home page

APPSC Group‌-1: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌..

Published Sat, Jun 11 2022 9:47 AM | Last Updated on Sat, Jun 11 2022 2:59 PM

APPSC: Free Model Interviews For Group 1 Mains Candidates - Sakshi

సాక్షి, అమరావతి: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, ఇతర అభ్యర్థులకు మోడల్‌ ఇంటర్వ్యూల కోసం ఉచిత శిక్షణ, దిశానిర్దేశం చేయనున్నట్టు ఏపీ స్టడీ సర్కిల్‌ సంచాలకుడు కె.హర్షవర్థన్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎపీపీఎస్‌సీ గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులకు ఈ నెల 15 నుంచి మౌఖి క పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించిందన్నారు.
చదవండి: AP: మీరు టీచరా?.. ఈ నూతన మార్గదర్శకాలు మీకోసమే..

ఈ నేపథ్యంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏపీ స్టడీ సర్కిల్‌ ద్వారా ఆ అభ్యర్థులకు తగిన తర్ఫీదు ఇచ్చేందుకు మోడల్‌ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏడాదికి రూ.6 లక్షల లోపు ఆదాయం కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఇతర అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోపు ఏపీటీడీసీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఐఎన్‌ పోర్టల్‌ నందు దరఖాస్తు చేసుకోవాలని హర్షవర్థన్‌ సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement