భారత్‌లో కోవిడ్‌ థర్డ్‌వేవ్‌.. ఫిబ్రవరిలో విజృంభణ! | Omicron led third COVID wave in India to peak in February IIT Kanpur researchers | Sakshi
Sakshi News home page

Covid Third Wave In India: ఫిబ్రవరిలో థర్డ్‌వేవ్‌ విజృంభణ!

Published Sat, Dec 25 2021 6:18 AM | Last Updated on Sat, Dec 25 2021 10:26 AM

Omicron led third COVID wave in India to peak in February IIT Kanpur researchers - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పతాక స్థాయికి చేరవచ్చని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) కాన్పూర్‌ పరిశోధకులు చేపట్టిన ఓ ముందస్తు అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసుల తీరు ప్రాతిపదికగా ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది. గౌసియన్‌ మిక్సర్‌ మోడల్‌ అనే టూల్‌ను ఉపయోగించి చేపట్టిన ఈ అధ్యయనాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని  స్పష్టం చేసింది.

ఇప్పటికే థర్డ్‌వేవ్‌తో సతమతమవుతున్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యాల్లో నమోదైన రోజువారీ కేసుల డేటాను ఉపయోగించుకుంటూ దేశంలో థర్డ్‌వేవ్‌ ప్రభావంపై ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పింది.  దేశంలో థర్డ్‌వేవ్‌లో డిసెంబర్‌ 15వ తేదీకి అటూఇటుగా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదు చోటుచేసుకోగా 2022 ఫిబ్రవరి 3వ తేదీకల్లా ఇది తీవ్ర స్థాయికి చేరుకోనుంది’ అని ఆ అధ్యయనం పేర్కొంది. అయితే, వ్యాక్సినేషన్‌ డేటాను పరిగణనలోకి తీసుకోనందున అప్పటికి కేసుల్లో పెరుగుదల ఏ మేరకు ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని కూడా స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement