kanpoor
-
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు మరో ప్లాన్.. సుప్రీంకు వినతి!
దేశరాజధాని ఢిల్లీలో కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. తాజాగా కృత్రిమ వర్షాలు కురిపించే యోచనతో ఢిల్లీ ప్రభుత్వం.. ఐఐటీ కాన్పూర్ను సంప్రదించింది. ఈ నేపధ్యంలో ఐఐటీ కాన్పూర్ అందించిన ప్రతిపాదనను శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షపాతం ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్నారు. కృత్రిమ వర్షం కురిపించాలంటే కనీసం 40 శాతం మేరకు మేఘాలు ఆవరించాలని, నవంబర్ 20, 21 తేదీల్లో ఇటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ బృందం తెలిపిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వస్తే కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా తీసుకుని కృత్రిమ వర్షాలు కురిపించే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ వర్షాలపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు సిల్వర్ అయోడైడ్ను ఆకాశంలో స్ప్రే చేయాల్సివుంటుంది. ఇది విమానం సహాయంతో ఆకాశంలో జరుగుతుంది. సిల్వర్ అయోడైడ్ అనేది మంచు లాంటిది. దీని కారణంగా తేమతో కూడిన మేఘాలలో నీటి పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా ఈ మేఘాల నుండి వర్షం కురుస్తుంది. దీనినే క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఇది కూడా చదవండి: 2100 నాటికి ప్రపంచ జనాభాలో భారీ తగ్గుదల? -
భారత్‌లో కోవిడ్ థర్డ్‌వేవ్.. ఫిబ్రవరిలో విజృంభణ!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ థర్డ్‌వేవ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పతాక స్థాయికి చేరవచ్చని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) కాన్పూర్ పరిశోధకులు చేపట్టిన ఓ ముందస్తు అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల తీరు ప్రాతిపదికగా ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది. గౌసియన్ మిక్సర్ మోడల్ అనే టూల్‌ను ఉపయోగించి చేపట్టిన ఈ అధ్యయనాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే థర్డ్‌వేవ్‌తో సతమతమవుతున్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యాల్లో నమోదైన రోజువారీ కేసుల డేటాను ఉపయోగించుకుంటూ దేశంలో థర్డ్‌వేవ్ ప్రభావంపై ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పింది. దేశంలో థర్డ్‌వేవ్‌లో డిసెంబర్ 15వ తేదీకి అటూఇటుగా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదు చోటుచేసుకోగా 2022 ఫిబ్రవరి 3వ తేదీకల్లా ఇది తీవ్ర స్థాయికి చేరుకోనుంది’ అని ఆ అధ్యయనం పేర్కొంది. అయితే, వ్యాక్సినేషన్ డేటాను పరిగణనలోకి తీసుకోనందున అప్పటికి కేసుల్లో పెరుగుదల ఏ మేరకు ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని కూడా స్పష్టం చేసింది. -
రిబ్బన్ కట్టారు..సిజర్ మరిచారు..
సాక్షి, కాన్పూర్ : అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచే ఘటన యూపీలో చోటుచేసుకుంది. కాన్పూర్ కలెక్టరేట్లో సోలార్ లైట్ ప్యానెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రిబ్బన్‌ను కట్ చేసేందుకు సిజర్ లేకపోవడంతో విసుగెత్తిన ఎంపీ, సీనియర్ బీజేపీ నేత డాక్టర్ మురళీ మనోహర్ జోషీ చేత్తోనే చించివేసి మమ అనిపించారు. ఆ తర్వాత మరోసారి రిబ్బన్ కట్టి సిజర్‌ను సిద్దం చేస్తున్న అధికారులను ఎంపీ వారించారు. ప్రారంభోత్సవం అయిపోందని, మరోసారి హడావిడి అవసరం లేదని సదరు అధికారికి క్లాస్ తీసుకున్నారు. అధికారిని ఉద్దేశించి..‘ఈ కార్యక్రమం నిర్వాహకులు మీరేనా..? ప్రారంభోత్సవం నిర్వహించేది ఇలాగేనా..మీ ప్రవర్తన ఏమాత్రం సరిగ్గా లేదు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.మరోసారి లాంఛనంగా ప్రారంభించాలని కోరగా అవసరం లేదంటూ అక్కడి నుంచి ఆగ్రహంగా వెనుదిరిగారు. మొత్తం కార్యక్రమం వీడియోలో రికార్డయింది. -
‘ఐ లవ్ పాకిస్తాన్' అంటూ యూపీలో..
-
‘ఐ లవ్ పాకిస్తాన్' అంటూ యూపీలో..
కాన్పూర్: యూపీలో 'ఐ లవ్ పాకిస్తాన్' అని రాసి ఉన్న బెలూన్లు కలకలం సృష్టించాయి. బెలూన్లను విక్రయిస్తున్న ఓ దుకాణాన్ని కాన్పూర్ పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాన్పూర్‌లోని గోవింద్నగర్లో ఉన్న ఓ దుకాణంలో ఐ లవ్ పాకిస్తాన్, హబీబీ అని ముద్రించి ఉన్న బెలూన్లను విక్రయిస్తున్నారు. హిందూ యువ వాహినికి చెందిన లాయర్ అజయ్ ప్రతాప్ సింగ్ ఇటీవల తన కుమారుడు బర్త్‌డే వేడుకకు గాను ఇక్కడి నుంచే బెలూన్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి బెలూన్లపై రాతలను గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు దుకాణం నిర్వాహకులైన సన్నీ, సమీర్ విజ్ లను అదుపులోకి తీసుకున్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు యత్నించిన నేరానికి వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఢిల్లీలోని ప్రముఖ హోల్‌సేల్ మార్కెట్ అయిన సదర్ బజార్‌లోని గబ్బరె వాలీగలీ నుంచి కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు. ఇటువంటి అభ్యంతరకర రాతలున్న బెలూన్లను ఎవరైనా విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలని పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ అలోక్ సింగ్ తెలిపారు. -
ఇక మొబైల్ ఫోన్లే.. బ్యాంకులు, పర్సులు
కాన్పూర్ :ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డీమానిటైజేషన్ పై చర్చ జరగ్గకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అవినీతిని కాపాడడానికే ప్రతిపక్షాలు పెద్ద నోట్లపై చర్చనుంచి దూరంగా పారిపోయాయని ధ్వజమెత్తారు. అయితే దేశంలో అవినీతిని నిరోధించడమే ప్రభుత్వ లక్ష్యమని మోదీ మరోసారి నొక్కి వక్కాణించారు. పార్లమెంటు కార్యక్రమాలను అడ్డుకునే క్రమంలో చివరికి స్పీకర్ పై పేపర్లు విసిరడం అమానుషమని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు దేశాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీని విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదని విమర్శించారు. కాన్పూర్ నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో సోమవారం పాల్గొన్న మోదీ పేదల కోసం అనేక సంక్షేమ కర్యక్రమాలను చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో ఆరుశిక్షణ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, పారిశ్రామిక శిక్షణ అందించడం నైపుణ్యాభివృద్ధి సంస్థ లక్ష్యమని చెప్పారు. దేశంలో పేదరికాన్ని పారద్రోలే శక్తి యువతలోనే ఉందని అన్నారు. డీమానిటైజేషన్ కష్టాలు త్వరలోనే తగ్గనున్నాయిన భరోసా ఇచ్చారు. దేశంలో వెయ్యి రూపాయల నోటు చలామణీలో ఉన్నపుడు రూ. 500, రూ.100 రూపాయల నోటు గురించి ఎవ్వరూ పట్టించుకోలేదని, పెద్దనోట్లు రద్దు నిర్ణయం అనంతరం ఇప్పుడు 100 రూపాయల నోటుకు కూడా ఎంతో ప్రాధాన్యం ఏర్పడిందని మోదీ అన్నారు. మోదీ ప్రసంగంలో కొన్ని అంశాలు విప్లవాత్మకమైన డిమానిటేజేషన్ చరిత్రలో రికార్డు కాకపోవచ్చుకానీ, అవినీతిని రూపుమాపడంలో పెద్ద నోట్లను రద్దు చేసిన ఘనత ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటంలో పేదల అండదండలు ప్రభుత్వానికి ఉన్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై లక్కీ డ్రా ద్వారా బహుమతులను పేదలు అందుకోనున్నారు. ప్రతి పక్షాల బలం నాకు తెలుసు.. బ్యాంకు ఆఫీసర్లకు లంచాలిస్తూ వారు ఏదైనా చేయగలరు. కానీ మా పోరాటం కొనసాగుతుంది. నల్లధనం కుబేరులకు చెక్ పెట్టేందుకు టెక్నాలజీ వాడుతున్నాం. ఈ క్రమంలో చాలా అప్రమత్తంగా ఉన్నాం. దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నాం. ఇక మీ మొబైల్ ఫోన్లే మీ బ్యాంకులు , పర్సులుగా మారనున్నాయి. మా అజెండా అవినీతి ఆపడానికి, వారి (ప్రతిపక్షాల) ఎజెండా పార్లమెంట్ అడ్డుకోవడం. జవాబుదారీగా, అవినీతికి వ్యతిరేకంగా ఉండటం కాంగ్రెస్ వల్లకాదు. రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యంగా విరాళాలు తీసుకునే సమయంలో అవినీతి రహిత రాజకీయాలకు ఉదాహరణగా నిలవాలి. నల్లధనంపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారనంతవరకు గుండారాజకీయాలకు అడ్డుకట్టవేయలేమని మోదీ పేర్కొన్నారు.