Who is Ishan Kishan's Girlfriend? - Sakshi
Sakshi News home page

#Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ను చూశారా? ఆమె బ్యాగ్రౌండ్‌ తెలుసా? ఎంత అందంగా ఉందో

Published Tue, Jul 18 2023 5:50 PM | Last Updated on Tue, Jul 18 2023 8:11 PM

Who is Ishan Kishans Girlfriend?  - Sakshi

టీమిండియా యవ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ తన కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. తాజాగా డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టుతో రెడ్‌బాల్‌ క్రికెట్‌లో కూడా ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ అడుగుపెట్టాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన తర్వాత కిషన్‌ పేరు ప్రపంచ క్రికెట్‌లో మారుమోగిపోయింది. కేవలం 126 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ సాధించిన కిషన్‌.. వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కాగా ఇషాన్‌ కిషన్‌ ఈ రోజు(జూలై 18) 25వసంతంలో అడుగుపెట్టాడు.

ఇక ఇది ఇలా ఉండగా.. ఫీల్డ్‌లో దూకుడుగా ఉండే కిషన్‌కు ఓ గర్ల్‌ఫ్రెండ్‌ ఉందన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. కిషన్‌ గత కొంతకాలంగా మోడల్ అదితి హుండియాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఆమె గతంలో చాలా సార్లు పలు సందర్భాల్లో ఇషాన్ కిషన్ ఆడిన మ్యాచ్ లలో కూడా దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఐపీఎల్‌ 2019 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆమె స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

కిషన్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు అతడిని ఉత్సాహపరుస్తూ కన్పించింది. దీంతో  దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి.  ఈ ఇద్దరూ కలిసి లంచ్, డిన్నర్ లకు  వెళ్లిన ఫోటోలు కూడా గతంలో  వైరల్ గా మారాయి. అదే విధంగా కిషన్‌ డబుల్‌ సెంచరీ సాధించినప్పుడు అతడిని అభినందిస్తూ ట్విట్‌ కూడా ఆమె చేసింది.

ఎవరీ  అదితి హుండియా?
అదితి హుండియా.. మోడలింగ్ వరల్డ్‌లో బాగా సుపరిచితమైన పేరు. రాజస్తాన్‌కు చెందిన 25 ఏళ్ల అదితి మోడల్‌గా తన కెరీర్‌ ప్రారంభించిన కొద్దిరోజులకే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2017లో మిస్ ఇండియా ఫైనల్‌కు చేరింది. అదే ఏడాదిలో మిస్‌ రాజస్తాన్‌గా ఆమె నిలిచింది. అలాగే 2018లో సూపర్ నేషనల్ మిస్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకుంది.

దీంతో ఆమె పోలండ్ లో జరిగిన మిస్ సుప్రానేషనల్ 2018 ఇంటర్నేషనల్  అందాల పోటీలలో కూడా భారత్ తరఫున  ప్రాతినిథ్యం వహించింది. అయితే అప్పడప్పుడు తన ఫోటోలను  అదితి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది. కాగా వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సమయంలో అదితి తన ఫోటో షూట్స్‌తో కుర్రకారును పిచ్చెక్కించింది. మోడ్రన్ వేర్స్ తో పాటు సంప్రదాయ  దుస్తుల్లో కూడా అదితో తన అందంతో అందరిని కట్టిపడేసింది.
చదవండి: Rinku Singh: ఐపీఎల్‌ కింగ్‌.. నాకు అతడే ఆదర్శం.. ఇక భజ్జూ పా సైతం..: రింకూ సింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement