
ఓవర్‌నైట్ స్టార్‌గా మెరిసి.. వెంటనే కనుమరుగైన తారలు ఎంతోమంది. అలాంటి వారిలో ఒకరే.. మధుస్నేహ ఉపాధ్యాయ. బాహుబలి సినిమాలోని మనోహరి పాటతో వెండితెర మీద ఒక్కసారిగా మెరిసి ప్రస్తుతం వెబ్‌తెర మీద వెలిగిపోతోంది.
►మధుస్నేహ.. పుట్టింది కోల్‌కతాలో.. పెరిగింది ముంబైలో.
►చిన్నప్పుడే సినిమాల్లో నటించాలని, తల్లిదండ్రులకు తెలియకుండా ఆడిషన్స్‌కు వెళ్లి తన్నులు తినింది.
►చదువు పూర్తిచేయాలని గట్టిగా చెప్పడంతో మంచి మార్కులతోనే డిగ్రీ పట్టా సాధించింది.
►నటిగా స్థిరపడాలనే లక్ష్యంతో ఒకవైపు మోడలింగ్ చేస్తూ ఆడిషన్స్ అటెండ్ అయ్యేది.
►మొదటి అవకాశంతోనే గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2015లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాలోని ‘మనోహరి’ పాటలో ప్రభాస్‌తో పాటు డాన్స్ చేసింది. ఆ పాట.. ఆ డాన్స్ ఆమెను అందరి దృష్టిలో పడేలా చేశాయి కానీ కొత్త అవకాశాలను ఇవ్వలేకపోయాయి. దీంతో సినిమాలను వదిలి సిరీస్‌లలో నటించడం మొదలుపెట్టింది.
►2018లో ‘ది ఎట్సెట్రాస్’ అనే కామెడీ వెబ్ సిరీస్‌లో నటించి, పాపులర్ అయింది. తర్వాత పలు యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ బిజీగా మారింది.
►ప్రస్తుతం ‘బేకాబూ’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది.
మా అమ్మ వయసులో ఉన్నప్పటి ఫొటోలను చూసి అమ్మ హీరోయిన్ అయితే బాగుండు అనుకున్నా. చిత్రంగా నాకు నటనపై ఇష్టం పెరిగింది. నటిగా మారాలనే లక్ష్యం కుదిరింది. – మధుస్నేహ ఉపాధ్యాయ.
Comments
Please login to add a commentAdd a comment