న్యూఢిల్లీ: మనిషి ఏదైన సాధించాలనుకుంటే వయస్సు అడ్డం కాదు..కావాల్సిందల్లా బలమైన సంకల్పం, చేయగలననే విశ్వాసం మాత్రమే. ఒక వ్యక్తి తన 50వ ఏటా, 50 కేజీల బరువు తగ్గడమే కాకుండా, మోడల్ రంగంలోను రాణించాడు. రజనీకాంత్, షారుఖ్ వంటి స్టార్‌లతో సినిమాలలో నటించాడు. కాగా, మోడల్ దినేష్ మోహన్ తన బరువు తగ్గడం వెనుక పడిన కష్టాన్ని హ్యుమన్స్ ఆఫ్ బాంబెతో ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు...దినేష్ మోహన్ ఒకప్పుడు అందరిలా బాగానే ఉన్నాడు..కొన్నేళ్ళకు ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నాడు. దానితో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆరోగ్య సమస్యలతో 44 ఏళ్ల వయస్సులో 130 కేజీల బరువు పెరిగిపోయాడు. అక్క, బావ డాక్టర్‌లు, సైకియాట్రిస్ట్ యార్టిక్స్‌లకు చూపించారు. కానీ అతని ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రంమార్పు రాలేదు. ఒక సంవత్సరంపాటు ఇంట్లోనే మంచానికే అంకిత మయ్యాడు.
ఒకరోజు కుటుంబ సభ్యులందరు దినేష్ దగ్గరికి వెళ్ళి కంటతడి పెట్టుకున్నారు. నువ్వు ఇలా కృంగిపోవడం బాగాలేదని, స్పూర్తీవంతమైన మాటలు చెప్పారు. కొన్ని రోజులకు దినేష్‌లో మార్పురావడం మొదలైంది. వెంటనే డైటిషియన్‌ను సంప్రదించాడు. అతని సూచనల మేరకు ఆహర నియమాలు పాటించాడు. మనస్సుకు ఆహ్లదాన్నిచ్చే వీడియోలు చూసేవాడు. ప్రధానంగా ఐ ఆఫ్ టైగర్‌వినడం ఎంతో స్పూర్తీ నిచ్చిందని చెప్పాడు. కొన్ని రోజులకు తన చుట్టుపక్కల వారితో కలవడం ప్రారంభించాడు. క్రమంగా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగై, బరువు 50 కేజీలు తగ్గింది. దీనికోసం అనేక రకాల వర్కవుట్స్ చేశాడు.
కొన్నిరోజుల తర్వాత ఇతడు సోషల్ మీడియాలో నన్ను గుర్తుపట్టారా.. నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను.. ఇప్పుడు ఎలా ఉన్నాను.. అని తన ఫోటోని పోస్ట్ చేశాడు. అది తెగ వైరల్ అయిపోయింది. ఆ ఫోటోలను ఫిదా అయిన నెటిజన్లు700ల కామెంట్లు, 18 వేల లైక్‌లు ఇచ్చి తమ సంతోషాన్నిపంచుకున్నారు... మీరు యువతకు ఎంతో ఆదర్శం, గొప్ప పనులకు వయస్సు అడ్డుకాదనడానికి మీరే మా స్ఫూర్తీ ప్రదాత అని కామెంట్టు చేశారు. .జీవితం ఎప్పుడూ ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి తెలియదని కాబట్టి వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సాధించగలననే నమ్మకం కల్గిఉండాలని అందరిలోను స్పూర్తీని నింపాడు.
Comments
Please login to add a commentAdd a comment