
ఈ అందగత్తే టీవీ సీరియల్ నటిగా కెరియర్‌ను దాదాపు ...
తాయ్‌పేయ్ : అందంగా ఉండటం అదృష్టమైతే! ఆ అందాన్ని చెక్కుచెదరనీయకుండా కాపాడుకోవటం అతి కష్టం. కొద్దిరోజులు శ్రద్ధపెట్టి అందానికి మెరుగులు దిద్దుకున్నా ఆ తర్వాత విసుగుపుట్టి వదిలేయటం జరుగుతుంటుంది. కానీ అతికొద్దిమంది మాత్రమే జీవితాంతం అలా వన్నెతరగని అందంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఆ కోవకు చెందినదే తైవాన్‌కు చెందిన సియావో అనే నటి. ఈ అందగత్తే టీవీ సీరియల్ నటిగా తన కెరియర్‌ను దాదాపు 20 ఏళ్లక్రితం మొదలెట్టింది. 1989లో తైవానీస్ రొమాంటిక్ డ్రామా టీవీ సిరీస్‌లో లీడ్ రోల్ పోషించింది. 1996లో వచ్చిన ‘ఏ సర్టైన్ ఆఫ్ లవ్ డ్రీమ్’ అనే టీవీ సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఈమె వయస్సుకు సంబంధించిన విషయాలు ఇంటర్‌నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏళ్లు గడుస్తున్నా వన్నె తరగని అందంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈమె వీబో అకౌంట్‌కు 344,000మంది ఫాలోయర్లు ఉన్నారు.
సియావో మాట్లాడుతూ.. ‘‘నేను గత 10 సంవత్సరాలుగా యోగా చేస్తున్నాను. తరుచూ స్విమ్మింగ్ కూడా చేస్తాను. పెంపుడు జంతువులతో కొసం కొంత సమయం కేటాయిస్తాను. నేను శాఖాహారినై ఉండటమే నిత్య యవ్వనానికి రహస్యం. సోషల్ మీడియాలో వస్తున్న ఆదరణకు చాలా సంతోషంగా ఉంది. నన్ను స్ఫూర్తిగా తీసుకుని పది మంది అందంగా అవ్వాలనుకుంటే ఇంకా సంతోషమ’ని పేర్కొంది. ఈమె 1968లో పుట్టింది. ప్రస్తుతం ఈమె వయస్సు 51 సంవత్సరాలు.