
ఎయిర్ పోర్టులో బట్టలు విప్పి పోర్న్ వీడియోకు ఫోజులిచ్చిన మోడల్‌కు 18 యేళ్ల జీవిత ఖైదు పడే అవకాశం ఉందని మీడియా వెల్లడించింది. వివరాల్లోకెళ్తే..
ఇండోనేషియాలోని జావా విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో అశ్లీల ఫొటో షూట్‌కు సిస్కై అనే మోడల్ బట్టలు విప్పి, ఫొటోలకు ఫోజులిచ్చిన వీడియో చాలా తక్కువ సమయంలో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. పిర్యాదు అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు తర్వాత డిసెంబర్ 4న పోలీసులు పశ్చిమ జావాలోని బాండుంగ్ సిటీలో సిస్కైని అరెస్టు చేశారు. అంతేకాదు పోర్నోగ్రఫీ చేసినందుకుగాను సదరు మోడల్‌కు 18 ఏళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు.
ఈ కేసులో స్థానిక పోలీసు చీఫ్ ముహ్రొమా ఫజ్రినీ మాట్లాడుతూ.. ‘ఈ వీడియోను అక్టోబర్‌లో చిత్రీకరించారని విమానాశ్రయ సిబ్బంది తెలియజేశారు. మోడల్ ప్రయాణం కోసం కాకుండా ఫోటోషూట్ కోసం ఈ విమానాశ్రయానికి వచ్చింది. ఫోర్నోగ్రఫీ చట్టం, ఐటీఈ చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలపై మోడల్‌ను అరెస్టు చేయడం జరిగిందని’ వెల్లడించారు.
మరోవైపు మోడల్.. ‘ఇలాంటి ఫోటోలు, వీడియోల వల్ల నేను జనాల్లో చాలా పాపులర్ అయ్యాను. ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను గుర్తిస్తారు. నా అభిమానులలో ఎక్కువ మంది పురుషులే. అనేక ప్రాంతాలకు ప్రయాణం చేశాను కూడా’ అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment