
శ్రీనగర్: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు జిర్సాక్ కాపీగా వార్తల్లో నిలిచిన కశ్మీరీ మోడల్ జునైద్ షా కన్నుమూశారు. గుండెపోటు రావడంతో శ్రీనగర్‌లోని తన నివాసంలో శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని కశ్మీర్ జర్నలిస్టు యూసఫ్ జమీల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "నిస్సార్ అహ్మద్ షా కొడుకు జునైద్ గుండెపోటుతో చనిపోయారు. అందరూ అతడిని హీరో రణ్‌బీర్ కపూర్‌లా ఉంటాడంటారు. నేను మాత్రం అతను కశ్మీర్‌కు, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులకు ఉన్న కొండంత బలం, ఆశ అని చెప్తాను". (రణ్‌బీర్ మా ఇంటికొచ్చి ఆఫర్ ఇచ్చాడు)
"28 ఏళ్ల జునైద్‌ను గత నెలలోనే ముంబైకు రావాల్సిందిగా కోరాను. ఇక్కడ మోడలింగ్ చేసుకుంటూ అనుపమ్‌ఖేర్ యాక్టింగ్ స్కూల్‌లో నటనపై శిక్షణ తీసుకోవచ్చని తెలిపాను. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది. అయితే అతనికి ఇంతకుముందెన్నడూ హృదయ సంబంధ వ్యాధులు లేవు" అని ఆయన పేర్కొన్నారు. కాగా కొన్ని సంవత్సరాల క్రితం అచ్చు రణ్‌బీర్ కపూర్‌లా ఉండే జునైద్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ తరుణంలో రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్ సైతం కొడుకును పోలిన వ్యక్తిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. (మోడల్ చనిపోయినట్లు ట్రోల్స్)
OMG. My own son has a double!!! Promise cannot make out. A good double pic.twitter.com/iqF7uNyyIi
— Rishi Kapoor (@chintskap) April 16, 2015