మోడల్‌పై లైంగిక దాడి.. వీడియో చిత్రీకరణ | Molestation On Model In Hyderabad Jubilee Hills | Sakshi
Sakshi News home page

మోడల్‌పై లైంగిక దాడి

Published Fri, Jan 10 2020 8:59 PM | Last Updated on Sat, Jan 11 2020 10:55 AM

Molestation On Model In Hyderabad Jubilee Hills - Sakshi

బంజారాహిల్స్‌: ఓ మోడల్‌పై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడుతుండగా మరో యువకుడు దానిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. వెంకటగిరి ప్రాంతానికి యువతి(21) కొద్ది రోజుల క్రితం మోడలింగ్‌ చేయడానికి నగరానికి వచ్చి ఎల్లారెడ్డిగూడలోని ఓ హాస్టల్‌లో ఉండేది. ఈ నేపథ్యంలో ఆమెకు హాస్టల్‌ యజమాని కుమారుడు రిషితో పరిచయం ఏర్పడింది.  కాగా నాలుగు నెలలుగా ఆమె తెలంగాణ మిస్‌ మోడల్‌ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతూ జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో తన  చెల్లితో కలిసి అద్దెకు ఉంటోంది. గత నెల 28న ఆమె సోదరి బంధువుల వద్దకు వెళ్లడంతో రిషితో పాటు అతడి స్నేహితుడు నిఖిల్‌రెడ్డి భోజనం చేస్తామంటూ ఆమె గదికి వచ్చారు.

గంజాయి మత్తులో ఉన్న రిషి ఆమెపై నోరు నొక్కి లైంగికదాడికి పాల్పడుతుండగా అతని స్నేహితుడు నిఖిల్‌రెడ్డి ఫోన్‌లో వీడియో తీశాడు. అంతేగాక నిఖిల్‌రెడ్డి ఆమె ఫోన్‌ లాక్కుని అందులో నుంచి రిషి ఫోన్‌కు ఓ తప్పుడు  మెసేజ్‌ను కూడా పంపించాడు. అయితే తాను భయంతో ఎవరికీ చెప్పుకోలేక తన  సొంత ఊరికి వెళ్లిపోయినట్లు తెలిపింది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా, వారి సూచన మేరకు ఈనెల 7న జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు శుక్రవారం రాత్రి మీడియాతో పేర్కొంది. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోగా, తనదే తప్పన్నట్లు చెబుతున్నారని  ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదు మార్చి రాయాలంటూ డీఐ రమేష్‌ తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది. తన కళ్లముందే ఎస్‌ఐ నిందితులను కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారని పేర్కొంది. పోలీసుల తీరుతో విసిగిపోయి మీడియా ముందుకు వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు.  తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసింది. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌రావు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement