Rozlyn Khan diagnosed with cancer, to undergo chemotherapy for 7 months
Sakshi News home page

Rozlyn Khan : 'క్యాన్సర్‌ వల్ల త్వరలోనే గుండుతో కనిపిస్తా.. అయినా సరే మోడలింగ్‌ చేస్తా'

Published Sat, Nov 12 2022 10:51 AM | Last Updated on Sat, Nov 12 2022 12:15 PM

Rozlyn Khan Diagnosed With Cancer And To Undergo Chemotherapy For 7 Months - Sakshi

సినీ పరిశ్రమలో ఈమధ్యకాలంలో ఎంతోమంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. తాజాగా మరో హీరోయిన్‌ తాను క్యాన్సర్‌ బారిన పడినట్లు చెప్పింది. బాలీవుడ్‌ నటి రోజాలిన్‌ ఖాన్‌ తనకు క్యాన్సర్‌ ఉందని వెల్లడిస్తూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఓ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. క్యాన్సర్‌.. నా జీవితంలో ఇదొక అధ్యాయం. ప్రతి ఎదురుదెబ్బ నన్ను బలంగా మారుస్తుంది. నాకోసం ప్రార్థించే వ్యక్తులు చాలామందే ఉన్నారు. నాకు అంతా మంచే జరుగుతుందనుకుంటున్నా.

ఇప్పుడు మెడనొప్పి, బ్యాక్ పెయిన్ తప్పించి ఏం లేదు. జిమ్‌లో వర్కవుట్స్‌ కారణంగా నొప్పి అనుకున్నాను. కానీ అదృష్టవశాత్తూ ప్రారంభదశలోనే దీన్ని గుర్తించగలిగాం. డియర్‌ బ్రాండ్స్‌.. ప్రతినెల 2వ వారం షూట్‌కి అందుబాటులో ఉంటాను. రాబోయే 7నెలల పాటు ప్రతినెలా కీమోథెరపీ చేయించుకోవాలి. ప్రతి సెషన్‌ తర్వాత వారం రోజుల పాటు రెస్ట్‌ అవసరం.కాబట్టి 2వ వారంలో నేను మీకు అందుబాటులో ఉంటాను. త్వరలో బట్టతల మోడల్‌తో పనిచేయాలంటే మీకు ధైర్యం కావాలి.

ప్రస్తుతానికైతే లైవ్‌లోకి వస్తాను అంటూ రోజ్లిన్‌ ఖాన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. ఇది చూసిన పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు మీరు త్వరలోనే కోలుకోవాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన రోజాలిన్‌ 2012లో ‘దమా చౌక్డీ’ అనే సినిమాతో వెండితెరపై కనిపించింది. ఆ తర్వాత బుల్లితెరపై కూడా సత్తా చాటింది. సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉండేది. క్యాన్సర్‌ బారిన పడినా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పలు బ్రాండ్స్‌కి మోడల్‌గా వ్యవహరిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement