![Taarak Mehta Ka Ooltah Chashmah Star Disha Vakani Dont Have Cancer - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/12/disha.jpg.webp?itok=WRk07lVJ)
(Disha Vakani) ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి దిశా వకానీపై వస్తున్న రూమర్లపై ఆమె సోదరుడు స్పందించారు. ఆమెకు ఎలాంటి క్యాన్సర్ లేదని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా ఆ నటికి గొంతు క్యాన్సర్ ఉందని వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఆమె సోదరుడు మయూర్ వకాని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొట్టి పారేశారు. ఆయన మాట్లాడుతూ..' ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి అభిమానులు ఇలాంటి వాటిని నమ్మొద్దు. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు.' అంటూ రూమర్లకు చెక్ పెట్టారు.
బుల్లితెర నటి దిశా వకాని ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’లో దయాబెన్ పాత్రతో ఫేమస్ అయ్యారు. ప్రముఖ టీవీ నటుడు జెన్నిఫర్ మిస్త్రీ బన్సీవాల్ ఆమె ఆరోగ్యంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 'నేను ఆమెతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటా. ఆమె ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నేను నమ్మను. అలాంటిదేమైనా ఉంటే మాకు తెలుస్తుంది. నేను ఆగస్టు నెలాఖరులో ఆమెతో మాట్లాడాను. మా కుమార్తె కథక్ తరగతుల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. ఇవన్నీ కేవలం రూమర్లే' అని కొట్టిపారేశారు. దిశా వకాని 2017 సంవత్సరంలో ఈ షో నుండి విరామం తీసుకుంది. అదే సంవత్సరంలో ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. 2019లో జరిగిన ఒక ఎపిసోడ్‌లో ఆమె ఈ షోలో మరోసారి కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment