
ఇటీవల గోవాలో జరిగిన మిస్టర్ ఇండియా సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021ని హైదరాబాద్‌కు చెందిన మోడల్ ప్రీతమ్ కళ్యాణ్ గెలుచుకున్నారు. జెస్సీ విక్టర్, రజ్నామొహమ్మద్‌ల ఆధ్వర్యంలో కొనసాగుతున్న RageNyou కంపెనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కంపెనీ ఆధ్వర్యంలో గోవాలో నిర్వహించిన అతిపెద్ద & ప్రతిష్టాత్మక ఈవెంట్‌లలో ఒకటైన మిస్టర్ ఇండియా సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 టైటిల్‌ను ప్రీతం కళ్యాణ్ కైవసం చేసుకున్నారు. మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్‌వాల్‌చే ఈ అవార్డును అందుకున్నారు. ఈ పోటీలో 20కి పైగా నగరాల నుండి 120 మందికి పైగా పోటీదారులు పోటీలో పాల్గొన్నారు.
మంగళవారం ప్రీతం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ అవార్డును దక్కించుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, మార్పును తీసుకురావడానికి అందాల వేదిక ఒక గొప్ప వేదిక అన్నారు. అందంగా ఉండటంతోపాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటమే కాకుండా కొత్త ప్రతిభను ఎల్లప్పుడూ ప్రోత్సహించేందుకు ఇలాంటి వేదికలు ఉపయోగపడుతాయన్నారు. మిస్టర్ ఇండియా సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 అనేది కేవలం అందాల పోటీ మాత్రమే కాదని, పరివర్తన, స్వీయ-అభివృద్ధి ప్రయాణమన్నారు. ఈ వేదిక ఎంతో మంది ఔత్సాహికులకు సరైన వేదికగా నిలవడమే కాకుండా దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపును అందిస్తుందన్నారు. ఈ అవార్డు సాధించడం తనకు ఎంతో ఉత్సాహాన్ని నింపిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment