Russian Model Gretta Vedler Who Scold Vladimir Putin Found Dead In Farm House - Sakshi
Sakshi News home page

Model Gretta Vedler Death: పుతిన్‌ను తిట్టిపోసిన మోడల్‌ దారుణ హత్య, ట్విస్ట్‌ ఏంటంటే..

Published Fri, Mar 18 2022 9:32 PM | Last Updated on Sat, Mar 19 2022 8:42 AM

Gretta Vedler Russian Model Who Scold Putin Killed - Sakshi

గ్రెట్టా వెడ్లెర్‌.. 23 ఏళ్ల రష్యన్‌ మోడల్‌. ఈమె దారుణ హత్య ప్రస్తుతం రష్యాలో కలకలం సృష్టిస్తోంది. కారణం.. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను ఇష్టానుసారం తిట్టిన ఆమె.. చాన్నాళ్లూ కనిపించకుండా పోయింది. చివరకు ఓ ఫామ్‌హౌజ్‌లో పార్క్‌ చేసి ఉన్న కారులో పాతసూట్‌కేసులో కుక్కేసి ఉన్న ఆమె మృతదేహం బయటపడింది.

గ్రెట్టా వెడ్లెర్.. మోడల్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. అయితే ఆమె పుతిన్‌ వ్యతిరేకి. గతంలో పుతిన్‌ను సైకోపాత్‌(మానసిక రోగి) అంటూ తిట్టిపోసింది. పుతిన్‌ను తిడుతూ.. 2021 జనవరిలో సోషల్‌ మీడియాలో ఓ వివాదాస్పద పోస్ట్‌ చేసింది. 

‘‘బాల్యంలో పుతిన్ చాలా అవమానాలను చవిచూశాడు. అందుకు అతని ఫిజిక్‌ కారణం. ఆ కారణంతోనే తన కోసం తాను నిలబడలేకపోయాడు. న్యాయ విద్యను విడిచిపెట్టి KGB లో చేరడానికి అదే కారణమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే నా దృష్టిలో అతనొక మానసిక రోగి’’ అంటూ కామెంట్లు చేసిందామె. ఆ తర్వాత కొన్నివారాలకు ఆ మోడల్‌ కనిపించకుండా పోయింది. దీంతో నానా కథనాలు వెలువడ్డాయి. 

అయితే తాజాగా ఆమె హత్యకు గురైందంటూ రష్యా దర్యాప్తు కమిటీ ఒకటి ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. అందులో వెడ్లెర్ ప్రియుడు దిమిత్రి కోరోవిన్‌.. తానే ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు ఉంది. పుతిన్‌ను తిట్టిన వ్యవహారానికి, ఆమె హత్యకు ఎలాంటి సంబంధంలేదని.. కేవలం డబ్బు కోసం జరిగిన వాగ్వాదంలో ఆమెను చంపేసినట్లు కోరోవిన్‌ అంగీకరించాడు. చివరిసారిగా మాస్కోలో కనిపించిన గ్రెట్టా వెడ్లెర్‌.. ఎక్కడో ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని ఓ ఫామ్‌హౌజ్‌లో శవంగా కనిపించడం, అదీ ఏడాది తర్వాత కావడంతో ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement