
వీడియో దృశ్యాలు
బీజింగ్ : ఓ లేడీ కస్టమర్ విచిత్రమైన రిక్వెస్ట్‌తో ఫుడ్ డెలివరీ బాయ్ షాక్ అయ్యాడు. అనంతరం కస్టమర్ రిక్వెస్ట్ వెనకున్న బలమైన కారణం అర్థం చేసుకున్నాడు. కస్టమర్ కోరినట్లుగానే ఆమె మాజీ ప్రియుడి ముఖంపై కాఫీ చల్లాడు. వివరాలు.. చైనాలోని షాంగ్‌డాంగ్‌కు చెందిన ఓ యువతి కొద్దిరోజుల క్రితం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సైట్‌లో ఓ కాఫీ ఆర్డర్ చేసింది. అయితే అది తనకోసం కాదు! మాజీ ప్రియుడి కోసం. ‘‘ అతడితో మర్యాదగా నడుచుకోవాల్సిన అవసరం లేదు. అతడి ముఖంపై కాఫీ చల్లితే సరిపోతుంది’’ అని ఫుడ్ డెలివరీ బాయ్‌ని ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుంది. కస్టమర్ విచిత్రమైన రిక్వెస్ట్‌తో డెలివరీ బాయ్ మొదట షాక్ అయినా.. ఆ తర్వాత ఆమె చెప్పినట్లుగానే చేయటానికి సిద్ధపడ్డాడు. ( లైవ్‌లో ఏడ్చేసిన హీరోయిన్ )
ఆమె మాజీ ప్రియుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ వెంటనే అతడిపై కాఫీ చల్లాడు. కస్టమర్ మాజీ ప్రియుడు.. డెలివరీ బాయ్ చర్యతో షాక్ తిన్నాడు. ఏం జరుగుతోందో అర్థంకాక అతడివైపు చూశాడు. డెలివరీ బాయ్ ఆ వెంటనే తన చేతిలోని ఓ చీటీ ముక్క కస్టమర్ మాజీ ప్రియుడి చేతిలో పెట్టి, క్షమాపణలు చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల వద్దనుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment