హృదయాన్ని కదిలించే చాలా విషయాల్ని మనం ట్వీటర్‌లో చూస్తూ ఉంటాం. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఫెడ్‌ఎక్స్ డెలీవరీ బాయ్ ఒకరు తాను డెలీవరీ ఇవ్వడానికి వెళ్లిన ఇంట్లో 11 ఏళ్ల పాప ఆటో ఇమ్యూనే అనే వ్యాధితో బాధపడుతుందని వాళ్ల ఇంటి డోర్ మీద ఉన్న దాన్ని చదివాడు. వెంటనే అతను బయటకు శానిటైజర్ తెచ్చి పార్శిల్‌ని చక్కగా తుడిచి వారికి అందించాడు. వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఆ పాపను కాపాడటానికి అతను చేసిన ప్రయత్నాన్ని అమెరికాకు చెందిన క్యారీ బ్లాసీ తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశారు. దానికి సంబంధించిన వీడియోతో పాటు కొన్ని ఫోటోలను కూడా ఆమె తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. (వైరల్ : కుక్క కోసం కొండచిలువతో పోరాటం)
మేం ప్యాకేజీలు డెలివరీ చేసే వారికి కోసం మా 11 ఏళ్ల పాప టైప్ 1 డయాబెటిక్ అని మా తలుపు మీద రాశాము. ఇది చూసిన ఫెడ్‌ఎక్స్ డెలివరీ బాయ్ నేను మీ డోర్ మీద ఉన్న నోటీసును చూడగానే నేను ఈ బాక్స్‌ని శానిటైజర్‌తో శుభ్రం చేశాను అని రాసి బాక్స్‌ను మాకు డెలివరీ చేశాడు అని తెలిపారు. అయితే వీటన్నింటికి సంబంధించి ఆమె చేసిన 24 సెకన్ల నిడివి గల వీడియోని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంత మంది నెటిజన్లు మాకు కూడా అలాంటి వ్యాధితో బాధపడే పాప ఉంది ఈ వీడియో చూడగానే కళ్లలో నీళ్లు వచ్చాయి అని కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment