
కోల్‌కతా : ఆహారానికి మతం లేదని వ్యాఖ్యానించి సోషల్ మీడియా వేదికల్లో ట్రెండింగ్‌లో నిలిచిన జొమాటో మరో వివాదంలో కూరుకుపోయింది. తాము సరఫరా చేస్తున్న ఆహారం తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందంటూ జొమాటో డెలివరీ బాయ్‌లు సోమవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా బీఫ్, ఫోర్క్‌ను సరఫరా చేసేందుకు వారు నిరాకరిస్తున్నారు. పే ఆర్డర్‌ను సవరించడంతో పాటు తమ ఉద్యోగుల మత విశ్వాసాలతో చెలగాటమాడటం మానుకోవాలని ఉద్యోగులు జొమాటోను డిమాండ్ చేస్తున్నారు.
తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉండే ఆహారాన్ని సరఫరా చేయబోమని చెబుతూ హిందూ, ముస్లిం ఫుడ్ డెలివరీబాయ్స్ అందరూ సోమవారం నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. తమ డిమాండ్లపై తాము ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఇంతవరకూ వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని వెల్లడించారు. ఇటీవల కొన్ని ముస్లిం రెస్టారెంట్లును ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లో యాడ్ చేశారని, అయితే వీటి నుంచి బీఫ్‌ను సరఫరా చేసేందుకు కొందరు హిందూ డెలివరీ బాయ్‌లు నిరాకరిస్తున్నారని జొమాటో ఫుడ్ డెలివరీ ఉద్యోగి మౌసిన్ అఖ్తర్ చెప్పుకొచ్చారు.
అయితే కొన్ని సందర్భాల్లో తాము పందిమాంసం డెలివరీ చేయాల్సి వస్తోందని ముస్లిం డెలివరీ బాయ్స్ వీటిని డెలివరీ చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మరోవైపు వేతన, చెల్లింపుల సమస్యలపై కూడా తాము అసంతృప్తిగా ఉన్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment