Zomato Case: Funny Video Goes on Viral Over Delivery Boy and Girl Versions - Sakshi
Sakshi News home page

జొమాటో వివాదం: ఇదట సంగతి...ఫన్నీ వీడియో వైరల్

Published Thu, Mar 18 2021 11:21 AM | Last Updated on Thu, Mar 18 2021 1:11 PM

Zomato controversy: funny viral video - Sakshi

సాక్షి, బెంగళూరు: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో గత కొన్ని రోజులుగా మరోసారి వార్తల్లో నిలిచింది. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌, యువతిపై దాడి వివాదం సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. జొమాటో బాయ్‌ తనపై దాడి చేశాడంటూ బెంగళూరు యువతి రక్తమోడుతున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది మొదలు రోజుకొక కొత్త వెర్షన్‌ వెలుగులోకి వస్తోంది. దీంతో నెటిజన్లు రెండు వర్గాలుగా  విడిపోయారు.  బాలీవుడ్‌ హీరోయిన్‌ సహా కొంతమంది హితేషా చంద్రాణీకి మద్దతిస్తోంటే.. మరికొందరు డెలివరీ బాయ్‌కు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక దశలో చంద్రాణిపై భారీ ట్రోలింగే నడిచింది. అటు తనకే పాపం తెలియదని, తనకు హయ్యస్ట్‌ రేటింగ్‌ ఉందంటూ జొమాటో బాయ్‌  కామరాజ్ వాదిస్తున్నారు. కేసులు నమోదైనాయి.  విచారణ జరుగుతోంది. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్‌, ఫన్నీ వీడియోస్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో  తెగ చక్కర్లు కొడుతోంది.  (యువతిపై జొమాటో బాయ్‌ పిడిగుద్దులు: వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement