కృషితో నాస్తి దుర్భిక్ష్యం అన్నారు పెద్దలు. కష్టపడి పనిచేస్తే అనుకున్న లక్ష్యాల్ని అలవోకగా సాధించవచ్చని నిరూపించాడు ఓ డెలివరీ బాయ్. ఐటీ కంపెనీలో జాబ్ సంపాదించాలనే కలలు కన్నాడు. ఆ కలల్ని సాకరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు. కానీ ఆర్ధిక ఇబ్బందులు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవ్వాలన్న ఆ యువకుడి కలల్ని చిన్నాభిన్నం చేశాయి. అయినా సరే ఓ వైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. మరో వైపు తాను అనుకున్న గోల్‌ను రీచ్ అయ్యేందుకు శ్రమించాడు. చివరికి అనుకున్నది సాధించాడు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం ఆ యువకుడి రియల్ లైఫ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డెలివరీ బాయ్ అంటే సమాజంలో ఓ చిన్నచూపుండేది. ఆర్డర్ పెట్టిన ఫుడ్ తింటుంటారని, కస్టమర్లతో మిస్ బిహేవ్ చేస్తుంటారానే అపవాదు ఉండేది. ‘మేమూ మనుషులమే..మమ్మల్ని చులకనగా చూడొద్దని వేడుకుంటున్న వారు..ప్రతిభలో తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు.
కరోనా లాంటి ఆపత్కాల సమయాల్లో ప్రాణాల్ని పణంగా పెట్టి కస్టమర్లకు కావాల్సిన నిత్యవసర సరుకుల్ని అందించారు. ఓవైపు కుంటుంబం బాధ్యతల్ని మోస్తూనే మరోవైపు ఉన్నతావకాశల కోసం ప్రయత్నించే వారేందరో ఉన్నారు. అలాంటి డెలివరీ బాయ్స్‌లో ఇప్పటికే ఎంతో మంది ఉన్నత హోదాల్లో స్థిరపడ్డారు. తాజాగా ఆ కోవకే చెందుతాడు ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు చెందిన డెలివరీ బాయ్ షేక్ అబ్దుల్ సతార్. ఒకప్పుడు డెలివరీ బాయ్ అయిన షేక్ అబ్దుల్ సతార్ ఇప్పుడు ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం సంపాదించాడు.
సతార్ తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో
సతార్ తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో తన రియల్ లైఫ్ స్టోరీని నెటిజన్లతో పంచుకున్నాడు. “నేను కలలు కనే డెలివరీ బాయ్‌ని. వీలైనంత త్వరగా ఆర్థికంగా ఎదగాలని అనుకునేవాడిని. ఎందుకంటే మా నాన్న కాంట్రాక్ట్ కార్మికుడు. కాబట్టి కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో అందుకే ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలని డెలివరీ బాయ్ ఉద్యోగం చేసేవాడిని. ఈ పని చేసేందుకు మొదట్లో నేను చాలా సిగ్గుపడేవాడిని. కానీ డెలివరీ బాయ్ అనుభవం నాకు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడింది." అని సతార్ తన లింక్డ్ ఇన్ లో తెలిపాడు.
ఒకరోజు, కోడింగ్ నేర్చుకోమని నా స్నేహితుడు సలహా ఇచ్చాడు. అందుకు కావాల్సిన కోర్స్‌లో జాయిన్ అవ్వమని, కోర్స్ వివరాలందించాడు. అతను చెప్పిన మాటలు నాపై ఎంతో ప్రభావం చూపాయి. నేను అతని సూచనను సీరియస్‌గా తీసుకున్నా. ఉదయం నుంచి సాయంత్రం దాకా కోడింగ్ నేర్చుకోవడం. సాయంత్రం 6గంటల నుంచి అర్ధరాత్రి 12:00 వరకు డెలివరీలు అందించేవాడిని . వాటి ద్వారా సంపాదించిన డబ్బుతో పాకెట్ మనీగానూ, కుటుంబ అవసరాలకు కూడా ఉపయోగించాను. అదే సమయంలో కోడింగ్ పూర్తి చేసుకొని సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదించాను. త్వరలో నేను సొంతంగా వెబ్ అప్లికేషన్‌లను తయారు చేయబోతున్నట్లు చెప్పాడు.
ప్రస్తుతం సతార్ గురించి తెలుసుకున్న నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటారు. కానీ పరిస్థితులే..డెలివరీ బాయ్ పనిచేసేలా దోహదం చేస్తాయి. డెలివరీ బాయ్స్‌ను చులకనగా చూడొద్దని.. అనుకుంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేధించే సత్తా తమలో ఉందంటూ తోటి డెలివరీ బాయ్స్ ధీమాగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment