దేశవ్యాప్తంగా నెటిజన్లను ఆకట్టుకున్న రాజస్థాన్‌లోని జోమాటో డెలివరీ బాయ్ దుర్గా మీనా చిరకాల కోరిక నెరవేరింది. ఇకపై అతడు పట్టుదలతో ప్రయత్నిస్తే ఒక్కో కష్టాన్ని దాటుకుంటూ వెళ్లగలడు. ఇదే సమయంలో దుర్గామీనాకు అండగా నిలబడిన ఆదిత్య శర్మపై కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది.
కరోనా కష్టాల కారణంగా టీచరు ఉద్యోగం పోయి బతుకుదెరువు కోసం దుర్గామీనా జొమాటో డెలివరీ బాయ్‌గా మారాడు. అతనికి బైక్ లేకపోవడంతో సైకిల్‌పైనే ఎర్రటి ఎండలో డెలివరీలు చేస్తున్నాడు. అతడి కష్టాన్ని చూసిన ఆదిత్య శర్మ అనే టీనేజర్ ట్విట్టర్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేశాడు. ఇలా పోగైన సొమ్ముతో దుర్గామీనాకి ఓ బైక్‌ను కొనిచ్చారు.
ఆదిత్య శర్మ ట్వీట్‌కి నెటిజన్ల నుంచి మంచి స్పందన రావడంతో కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే దుర్గామీనాకి బైక్ వచ్చింది. హీరో షోరూమ్‌లో బైక్‌ని హండోవర్ చేసుకునే సమయంలో భావోద్వేగానికి లోనయ్యాడు దుర్గామీనా. కాగా సాటి మనిషి కష్టాలను చూసి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని మనుషుల్లో మానవత్వాన్ని తట్టి లేపిన ఆదిత్యశర్మని నెటిజన్లు కొనియాడుతున్నారు.
✅❤️
— Aditya Sharma (@Adityaaa_Sharma) April 12, 2022
All thanks to you guys.
He was emotional during buying bike ❤️ pic.twitter.com/XTgu17byOm
చదవండి: రాజస్థాన్‌లో మండిపోతున్న ఎండలు.. సైకిల్‌పై జొమాటో డెలివరీ.. ఆ తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment