న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్, ఎక్కువ డిస్కౌంట్‌లు వంటి వాటి వల్ల ఎక్కువ మంది కస్టమర్లు ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఆసక్తి చూపుతున్నారు. నిత్యావసరాల నుంచి ఎలాక్ట్రానిక్ పరికరాల వరకు ప్రతిదానిని ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అమెజాన్ డెలివరీ బాయ్ ఒకరు ఆర్డర్ క్యాన్సల్ అయ్యిందంటూ కస్టమర్‌కి అబద్దం చెప్పి మొబైల్‌ని అమ్ముకున్నాడు. కస్టమర్ ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వివరాలు.. ఢిల్లీ కిద్వాయ్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి అమెజాన్‌లో మొబైల్‌ని బుక్ చేశాడు. అక్టోబర్ 1న అది డెలివరీ కావాల్సి ఉంది. ఈ క్రమంలో డెలివరీ బాయ్ అతడి ఇంటికి వచ్చి.. మీ ఆర్డర్ క్యాన్సల్ అయ్యింది.. త్వరలోనే మీ డబ్బు తిరిగి రీఫండ్ చేస్తారని చెప్పాడు. దాంతో అతడు అమెజాన్ సైట్‌లోకి వెళ్లి రీఫండ్ గురించి కంప్లైంట్ చేశాడు. (చదవండి: 12 గంటల్లో 1.75 లక్షల ఫోన్ల అమ్మకం)
దీని గురించి చెక్ చేసిన అమెజాన్ అతడి మొబైల్ ఆల్‌రెడీ డెలివరీ చేశామని చెప్పింది. దాంతో అతడు కిద్వాయి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. అతడిని ఢిల్లీ జవహర్ క్యాంప్‌కి చెందిన మనోజ్‌గా గుర్తించారు. ఇక విచారణలో డబ్బు అవసరం ఉండటంతో మొబైల్‌ని తానే అమ్ముకున్నానని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment