నెల్లూరు : డిప్యూటీ మేనేజర్ చేతిలో దాడికి గురైన మహిళా ఉద్యోగి ఉషారాణిని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె జరిగిన దాడి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సాయం అందజేస్తుందని ఆమెకు హామీ ఇచ్చారు. కాగా, నెల్లూరులోని ఏపీ టూరిజం కార్యాలయంలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న భాస్కర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉషారాణిపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దివ్యాంగురాలన్న కనీస కనికరం లేకుండా ఉషారాణిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. బాదితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు భాస్కర్‌ను డిప్యూటీ మేనేజర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.(చదవండి : దివ్యాంగురాలిపై పాశవిక దాడి)
Comments
Please login to add a commentAdd a comment