
రైల్వే అండర్ పాసు వద్ద బైక్ నిలిపి ఆమెను లోపలికి బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అనకాపల్లి : మండలంలోని నరసింగబిల్లి వద్ద 19 ఏళ్ల యువతి లైంగిక దాడికి గురైంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగు చూసింది. మంగళవారం నిందితుడిని పట్టుకుని కోర్టుకు తరలించారు. అనకాపల్లి రూరల్ సీఐ ఎ.రవికుమార్ విలేకరులకు అందించిన వివరాలు. మండలంలోని నరసింగబిల్లి వద్ద తమ గ్రామానికి వెళ్లేందుకు 19 ఏళ్ల యువతి వాహనం కోసం ఎదురుచూస్తుండగా, సోమవరం గ్రామానికి చెందిన కరణం వెంకట నాగేంద్రబాబు(23) సోమవారం సాయంత్రం బైక్‌పై ఆమె వద్దకు వెళ్లి ఆగి మాట్లాడాడు.
ఆమె తనతో రావడానికి నిరాకరించడంతో బలవంతంగా బైక్ ఎక్కించుకొని నరసింగబిల్లి రైల్వే గేటు వద్దకు బయల్దేరి, అక్కడి నుంచి పక్క మార్గంలో తీసుకెళ్లాడు. అక్కడ రైల్వే అండర్ పాసు వద్ద బైక్ నిలిపి ఆమెను లోపలికి బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ ఎ.ఆదినారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. మంగళవారం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సోమవరంలో తన ఇంటి వద్దనున్న నిందితుడు నాగేంద్రబాబును అరెస్ట్ చేశారు. నిందితుడ్ని అనకాపల్లి కోర్టులో జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరు పరచినట్లు తెలిపారు.