Is Rashmika Mandanna celebrated her birthday at Vijay Deverakonda's house? - Sakshi

Rashmika- Vijay: రష్మికకు రింగ్‌ తొడిగిన విజయ్‌?.. ఒకే ఇంట్లో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

Apr 6 2023 4:31 PM | Updated on Apr 6 2023 4:59 PM

Is Rashmika Mandanna Celebrated Her Birthday With Vijay Devarakonda - Sakshi

హీరోయిన్‌ రష్మిక మందన్నా- విజయ్‌ దేవరకొండ డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం సినిమాతో తొలిసారిగా కలిసి నటించిన వీరిద్దరూ ఆ సినిమా డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో మరోసారి జంటగా కనిపించారు. చేసింది రెండు సినిమాలే అయినా వీళ్ల జోడీకి సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఏర్పడింది. రష్మకి-విజయ్‌ల కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆన్‌స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్‌స్క్రీన్‌లో కూడా వీళ్ల పెయిర్‌కు మాంచి క్రేజ్‌ ఉంది.

కలిసి వర్కవుట్‌ చేయడం దగ్గర్నుంచి డిన్నర్‌, వెకేషన్స్‌ అంటూ ఇద్దరూ కలిసి తిరగిన ఫోటోలు బయటకు రావడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీనికి తోడు విజయ్‌ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి రష్మిక అటెండ్‌ అవడం, కలిసి న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ చేసుకోవడంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారనే టాక్‌ గట్టిగానే వినిపిస్తుంది.

తాజాగా రష్మిక బర్త్‌డే సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతూ ఓ వీడియో పోస్ట్‌ చేసింది. కాసేపటికే విజయ్‌ దేవరకొండ కూడా సేమ్‌ లొకేషన్‌లో ఉన్న ఓ ఫోటో బయటకు వచ్చింది. దీంతో ఓ మీడియా సంస్థ విజయ్‌-రష్మికల డేటింగ్‌ను కన్‌ఫామ్‌ చేస్తూ.. ''విజయ్‌, రష్మికలు డేటింగ్‌ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమే. విజయ్‌ తన ఫేవరెట్ రింగ్‌ను రష్మికకు తొడిగాడు.

వారిద్దరూ ఒకే ఇంట్లో, ఒకే రూమ్‌లో ఉంటున్నారు. మనం త్వరలోనే గుడ్‌న్యూస్‌ వినబోతున్నాం'' అంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై రష్మిక స్పందిస్తూ..'అయ్యో ..అతిగా ఆలోచించకు బాబు' అంటూ రీట్వీట్‌ చేసింది. కానీ తాము ప్రేమలో లేమని మాత్రం చెప్పలేకపోయింది. దీంతో విజయ్‌-రష్మికలు త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్‌ చేస్తారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement