Rashmika Mandanna Shares a Lovely Video on Valentine's Day - Sakshi
Sakshi News home page

Rashmika: రష్మిక వాలెంటైన్స్ డే విషెస్.. ఆడేసుకున్న నెటిజన్స్..!

Published Tue, Feb 14 2023 3:05 PM | Last Updated on Tue, Feb 14 2023 3:31 PM

Rashmika Mandanna Latest Post Goes Viral  - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అటు టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాలతో తెగ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వాలెంటైన్స్‌ డే సందర్భంగా రష్మిక చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది. మీ అందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది. 

రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'నన్ను ప్రేమించే వారికి మా తరఫున ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.' అంటూ ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఆ వీడియోలో తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కనిపించింది ముద్దుగుమ్మ. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ కోసమేనా అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో విజయ్ ఎక్కడ? కియారా-సిద్ధార్థ్ లాగా మీరు కూడా పెళ్లి చేసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక- విజయ్ బెస్ట్ కపుల్స్ అంటూ కామెంట్స్ పెట్టారు. 

కాగా.. ఇటీవలే విజయ్‌తో నటించిన వారిసు(వారసుడు)తో సక్సెస్ అందుకున్న నేషనల్ క్రష్ అల్లు అర్జున్ పుష్ప-2 నటించనుంది. ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక ఆ తర్వాత స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 'పుష్ప' హిట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం రణ్‌బీర్‌తో ‘యానిమల్‌’ సినిమాలో నటిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement