
National Crush Rashmika Mandanna Childhood Photos: రష్మిక మందన్న.. నిజానికి కన్నడ నటి. తెలుగులో ఛలో సినిమాలో నటించినా అంత గుర్తింపు రాలేదు. కానీ గీతగోవిందం సినిమాతో ఒక్కసారిగా తెలుగు స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న 'పుష్ప: ది రైజ్' చిత్రంలో 'శ్రీవల్లి' పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'సామి సామి' సాంగ్ ఎంత బంపర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా 'మిషన్ మజ్ను' చిత్రంతో హిందీలో అరంగ్రేటం చేయనుందీ క్యూటీ. సినిమాలో బిజీయే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుందీ శ్రీవల్లి. అయితే తాను సోషల్ మీడియాలో షేర్ చేసిన నేషనల్ క్రష్ చిన్ననాటి ఫొటోలపై ఓసారి లుక్కేద్దామా !
1996, ఏప్రిల్ 5న కర్ణాటకలోని విరాజీపేటల జన్మించింది రష్మిక మందన్న. సైకాలజీలో బ‍్యాచ్‌లర్ డిగ్రీ, జర్నలిజం అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ చదివింది. ఓ పక్క చదువుతూనే మరోపక్క మోడలింగ్ కూడా చేసింది. 2014కు గాను 'క్లీన్ అండ్ క్లియర్ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ అఫ్ ఇండియా' టైటిల్ కూడా గెలుచుకుంది. 2016లో కన్నడ సినిమా 'కిర్రాక్ పార్టీ'తో సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. తర్వాత 2017 జూలై 3న తన కోస్టార్ రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగింది. అనంతరం పలు అనివార్య కారణాలతో వారి వివాహం ఆగిపోయింది. తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన 'గీతా గోవిందం'తో ఒక్కసారిగా పాపులర్ అయింది రష్మిక.
ఇది చదవండి: 'ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. అది సమస్యేమీ కాదు'
Comments
Please login to add a commentAdd a comment