Heels
-
ఎంత స్టార్ హీరో అయినా ఆమె చెప్పులు మోయాల్సిందే!
బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఫైటర్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె జంటగా కనిపించనుంది. అయితే 2014లో తన భార్య సుసానే ఖాన్‌తో హృతిక్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సింగర్ సబా ఆజాద్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సానికి తన లవర్‌తో కలిసి పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో హృతిక్ చేసిన పనికి నెటిజన్స్ షాకవుతున్నారు. తాజాగా ముంబయిలో జరిగిన ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో అమిత్, సబాతో ఫోటో దిగుతుండగా వెనకాలే హృతిక్ చేతిలో హీల్స్ పట్టుకుని కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తన లవర్ సబా హీల్స్‌ను హృతిక్ చేతులతో పట్టుకుని కనిపించడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో లవర్‌పై ప్రేమ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు హృతిక్ చేసిన పనికి షాకవుతున్నారు. ప్రియురాలి హీల్స్‌ను చేతుల్లో మోస్తున్న హృతిక్ సింప్లిసిటీకి మెచ్చుకోవాలంటూ పోస్ట్ చేశారు. అయితే గతేడాది డిన్నర్ డేట్లో కనిపించిన తర్వాత ఇద్దరు రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ముంబైలోని జుహు ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఈ జంట కలిసే వెళ్తున్నారు. ఆ తర్వాత కూడా హృతిక్ ఫ్యామిలీతో గెట్-టుగెదర్, కరణ్ జోహార్ బర్త్‌డే వేడుకలో జంటగా కనిపించి తమ రిలేషన్‌షిప్‌ను కొనసాగించారు. మరోవైపు హృతిక్ మాజీ వైఫ్ సుసానే ఖాన్.. అర్జున్ రాంపాల్‌తో క్లోజ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Amit Aggarwal (@amitaggarwalofficial) -
కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా.. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి.
కొందరిలో కాళ్లమీద పగుళ్లు చాలా లోతుగా ఏర్పడి నొప్పిని కలిగిస్తుంటాయి. మరీ ముఖ్యంగా మడమల మీద ఈ పగుళ్లు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. సాధారణంగా చాలామందిలో కాళ్ల పగుళ్లు చలికాలంలో వస్తుంటాయి. కానీ కొందరిలో మాత్రం వేసవిలోనూ కనిపిస్తుంటాయి. ►కాళ్ల పగుళ్లకు చాలా కారణాలు ఉండవచ్చు. ఎండాకాలంలో దేహానికి తగినంత నీరు అందని సందర్భాల్లో కూడా కాళ్లలో పగుళ్లు రావచ్చు. మరికొందరిలో... వారు వాడే సబ్బు సరిపడకపోవడం, తరచూ సబ్బునీళ్లలో కాళ్లు తడుస్తూ ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంటుంది. (బట్టలు ఉతికే మహిళల్లో డిటర్జెంట్ కలిసిన నీళ్లవల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది). ఇక ఆహారంలో పోషకాలు తగినన్ని అందని వారిలో కూడా ఈ సమస్య రావచ్చు. ►ఇక మరికొందరిలో డయాబెటిస్, థైరాయిడ్ లేదా ఒబేసిటీ లాంటి ఆరోగ్యసమస్యలు ఉన్న సందర్భాల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అందుకే ఆ సమస్యలతో బాధపడుతున్నవారు తమకు ఏ కారణంగా కాళ్లపగుళ్లు వచ్చాయో నిర్ధారణ చేసుకోవడం కోసం వైద్యపరీక్షలు చేయించి, ముందుగా అసలు (అండర్లైయింగ్) సమస్యకు చికిత్స తీసుకోవాలి. చదవండి: ముందే గుర్తిస్తే... డయాబెటిస్‌ను నివారించవచ్చు ►ఇంకొందరిలో బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు కాళ్ల పగుళ్ల సమస్యకు కారణం కావచ్చు. అలాంటివారిలో కాళ్ల పగుళ్లు బాగా లోతుగా ఉండి, వాటినుంచి రక్తస్రావం జరుగుతున్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే ఆ దశకు చేరాక కూడా వాటికి తగిన చికిత్స తీసుకోకపోతే అవి పగుళ్ల స్థాయి నుంచి పుండ్లుగా మారే అవకాశం ఉంది. ఇదేగానీ డయాబెటిస్ ఉన్నవారిలో జరిగితే సమస్య లు మరింత జటిలంగా మారే అవకాశం ఉంది. ►కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం ద్వారా చాలామందిలో కనిపించే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటివారు వీలైనంతగా మంచి నీటిని ఎక్కువగా తాగుతుండాలి. అలాగే ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి కాళ్లను కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి, శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం పొడిబట్టతో తడి లేకుండా తుడవాలి. ►మాయిశ్చరైజర్ ఉండే క్రీములను కాళ్లకు రాసుకొని రాత్రంతా సాక్సులను ధరించి నిద్రించడం లాంటి చిన్న చిన్న ఉపశమన చికిత్సలతోనే చాలామందిలో ఇవి తగ్గిపోతాయి. అలా తగ్గకపోతే అవి ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా వచ్చినవిగా పరిగణించి, అసలు సమస్య నిర్ధారణ, చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదించాలి. చదవండి: Health Tips: విటమిన్ బి 12 లోపమా.. ఇవి తిన్నారంటే.. -
గన్ ఆకారం హీల్స్ వేసుకున్నందుకు...
వాషింగ్టన్ః తుపాకీ హీల్స్ ధరించి, బుల్లెట్ బ్రాస్లెట్లను బ్యాగ్ లో తీసుకెడుతున్న అమ్మాయికి అమెరికా ఎయిర్ పోర్టు అధికారులు అభ్యంతరాలు తెలిపారు. చూసేందుకు అచ్చం బులెట్లలా ఉన్నరెండు బ్రాస్టెట్లను బ్యాగ్ లో పెట్టుకొని, నిజం తుపాకీల్లా ఉన్నహై హీల్స్ ధరించడమే ఆమె ప్రయాణానికి అడ్డంకిగా మారింది. ప్రమాదకర వస్తువులతో ప్రయాణమైనట్లు అనుమానించిన ఎయిర్ పోర్టు సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అక్కడే నిలిపేశారు. అభ్యంతర కర వస్తువులతో ఆమె ట్రావెల్ చేయడంతో ఎంతో సమయం వృధా అయ్యిందని బాల్టిమోర్ వాషిగ్టన్ ఎయిర్ పోర్టు ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సభ్యురాలు లిసా ఫార్బెస్టన్ తెలిపారు. ఏజెంట్లు ఆమెవద్ద ప్రమాదకర వస్తువులున్నాయని గుర్గించారని, అందుకే ప్రత్యేక తనిఖీలు చేపట్టాల్సివచ్చిందని ఆమె అన్నారు. షూస్, బ్రాస్లెట్లు ధరించడం అభ్యంతరం కాదని, అయితే ఆయుధాలు, మందుగుండు సామగ్రి వంటివి తీసుకొని ప్రయాణించేందుకు టీఎస్ఏ అనుమతి ఉండదని ఆమె ఓ ట్వీట్లో తెలిపారు. అయితే ఆమె ఆ వస్తువులు చెక్ పాయింట్ దగ్గర చెక్డ్ బ్యాగ్ లో పెట్టుకున్నారని అనంతరం నియమాలకు విరుద్ధంగా బోర్డింగ్ సమయంలో వాటిని తీసి ధరించారని ఫార్బెస్టన్ తెలిపారు. కాగా ఆమెపై ఎటువంటి కేసులు పెట్టలేదని బాల్టిమోర్ సీబీఎస్ నివేదించింది. ప్రస్తుతం టీఎస్ఏ ఏజెంట్లకు తన బూట్లను అప్పగించి వెళ్ళిన యజమాని అడ్రస్ కోసం షూ తయారీదారుడు ఎదురు చూస్తున్నాడు. తన బూట్లను ఎయిర్ పోర్టులో వదిలి వెళ్ళిన మహిళకోసం శోధిస్తున్నట్లు ప్లెజర్ యుఎస్ఏ షూ కంపెనీ యజమానులు తమ కంపెనీ ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. దయచేసి తమను సంప్రదించాలని, తమ కారణంగా విమానం తప్పిపోయిన మహిళకు మరో బాండ్ గర్ల్ బూట్ల జతను ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు.