Prabhas and Hrithi Roshan to star together with director Siddharth Anand - Sakshi
Sakshi News home page

Prabhas-Hrithik Roshan: ప్రభాస్ హృతిక్ రోషన్ మల్టీస్టారర్‌.. నెవర్‌ బిఫోర్‌, ఎవర్‌ ఆఫ్టర్‌

Published Mon, Jan 30 2023 12:24 PM | Last Updated on Mon, Jan 30 2023 2:37 PM

Prabhas And Hrithi Roshan To Star Together In Upcoming Film - Sakshi

బాలీవుడ్‌లో ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’(2014), ‘వార్‌’ (2019), ‘పఠాన్‌’(2023) వంటి సూపర్‌ హిట్స్‌ సాధించారు దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌. ఆయన దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఓ సినిమా రూపొందనుందని, ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్‌పై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో మల్టీ స్టారర్‌గా ఈ మూవీ రూపొందనుందని, ఇందులో ప్రభాస్, టైగర్‌ ష్రాఫ్‌లు కలిసి నటిస్తారనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపించింది.

తాజాగా ఈ సినిమాలో ప్రభాస్, హృతిక్‌ రోషన్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక హృతిక్‌ రోషన్, సిద్ధార్థ్‌ ఆనంద్‌ కాంబినేషన్‌లో 2019లో ‘వార్‌’ సినిమా వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ‘ఫైటర్‌’ మూవీ తెరకెక్కుతోంది. ప్రభాస్‌ కూడా ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ లతో పాటుగా ‘రాజాడీలక్స్‌’(ప్రకటన రావాల్సి ఉంది) సినిమాలతో బిజీగా ఉన్నారు.

ప్రభాస్‌తో పాటు హృతిక్‌ రోషన్‌–సిద్ధార్థ్‌ ఆనంద్‌ల ప్రస్తుత కమిట్‌మెంట్‌ ప్రాజెక్ట్స్‌ పూర్తయిన తర్వాతే వీరి ముగ్గురి కాంబినేషన్‌ సినిమా గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశాలుఉన్నాయి. కాగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement