‘వార్’ (2019) సినిమా తర్వాత హీరో హృతిక్‌రోషన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా సినిమా ‘ఫైటర్’. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో హృతిక్, దీపిక ఎయిర్‌ఫోర్స్ పైలెట్స్‌గా కనిపిస్తారు. అయితే ఈ సినిమా రిలీజ్ తేదీ మరోమారు మారింది.
తాజాగా ‘ఫైటర్’ సినిమాను జనవరి 25, 2024న రిలీజ్ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు మేకర్స్. తొలుత ‘ఫైటర్’ సినిమాను 2023 జనవరిలో, ఆ తర్వాత సెప్టెంబరులో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment