హృతిక్ రోషన్- సబా ఆజాద్.. మొదట్లో గుట్టుచప్పుడు కాకుండా తిరిగేవారు. కానీ వారి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియా దరువేసి మరీ చెప్పడంతో ఇప్పుడు నిర్మొహమాటంగా అందరి ముందే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. పార్టీలకు సైతం కలిసే వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రేమజంట యూరప్‌లో ఉంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ప్రతిక్షణాన్ని మధుర జ్ఞాపకంగా మలుచుకుంటోంది. తాజాగా హృతిక్‌తో రోడ్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న సబా దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
ఇందులో వాళ్లిద్దరు కనిపించకపోయినప్పటికీ హృతిక్ వేలికి ఉన్న రింగు మాత్రం కనిపించింది. బహుశా అతడే కారును డ్రైవ్ చేస్తున్నట్లున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. 'మీ సంతోషకరమైన క్షణాలను మాతో పంచుకుంటున్న చాలా థ్యాంక్స్. మీ ఇద్దరినీ ఇలా చూస్తుండటం బాగుంది. ట్రిప్‌ను ఎంజాయ్ చేయండి', 'త్వరలోనే పెళ్లి చేసేసుకోండి' అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: తనకన్నా ఆరేళ్లు చిన్నవాడితో ఆరేళ్లు డేటింగ్, పిల్లలు పుట్టాక పెళ్లి
పక్కనోడి లైఫ్ నీకెందుకు?: ట్రోలర్స్‌కు నటుడి స్ట్రాంగ్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment