రజనీకాంత్‌తో ఉన్న ఈ పిల్లాడు స్టార్ హీరో.. గుర్తుపట్టారా!? | Hrithik Roshan With Rajinikanth ThrowBack Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Guess The Actor: ఈ పిల్లాడు సూపర్‌స్టార్.. గ్రీకువీరుడు అంటార్రా బాబు!

Published Sun, Sep 17 2023 8:25 PM | Last Updated on Mon, Sep 18 2023 5:13 PM

Hrithik Roshan With Rajinikanth ThrowBack Photo - Sakshi

అప్పుడప్పుడు కొన్ని పాత ఫొటోలు బయటపడుతుంటాయి. అలానే తాజాగా ఓ పిక్ సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అయింది. 'జైలర్'తో హిట్ కొట్టి మంచి ఊపుమీదున్న రజనీకాంత్‌తోపాటు ఓ పిల్లాడు ఉన్నాడు. అతడెవరా అని నెటిజన్స్ తెగ ఆలోచిస్తున్నారు. మరి మీరేమైనా కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?

రజనీకాంత్ దాదాపు రెండు మూడు జనరేషన్లని కవర్ చేసిన హీరో అనొచ్చు. ఎందుకంటే అప్పటితరం హీరోలకు పోటీ ఇచ్చాడు. ఇప్పటి హీరోలకి కూడా పోటీ ఇస్తూ అసలు సిసలైన సూపర్‌స్టార్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. సరే పైన పిక్ విషయానికొచ్చేద్దాం. మీలో పలువురు గెస్ చేసింది కరెక్టే. రజనీతో ఉన్నది ప్రస్తుత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.

(ఇదీ చదవండి: నటుడు నరేశ్ ఎమోషనల్.. అది తలుచుకుని బాధపడి!)

రజనీ విషయానికొస్తే.. 'రోబో' తర్వాత సరైన హిట్ కొట్టలేకపోయిన ఈయన రీసెంట్‌గా 'జైలర్'తో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇక తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి.

మరోవైపు అడపాదడపా చిత్రాలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తున్న హృతిక్ రోషన్.. ప్రస్తుతం 'ఫైటర్' మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'వార్ 2' చేయబోతున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కూడా వన్ ఆఫ్ ది హీరోగా నటించబోతున్నాడు. హృతిక్ వ్యక్తిగత విషయాలకొస్తే.. సుస్సానే ఖాన్‌తో 14 ఏళ్లు సంసారం చేసిన తర్వాత విడిపోయాడు. ప్రస్తుతం షబా ఆజాద్ అనే యంగ్ బ్యూటీతో రిలేషన్‌లో ఉన్నాడు.

(ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement