Boycott Vikram Vedha Trends After Hrithik Roshan Support Aamir Khan Movie - Sakshi
Sakshi News home page

Bollywood-Boycott Trend: ఆమిర్‌కు మద్దతు.. స్టార్‌ హీరోకు బాయ్‌కాట్‌ సెగ

Published Tue, Aug 16 2022 12:10 PM | Last Updated on Tue, Aug 16 2022 1:20 PM

Boycott Vikram Vedha Trends After Hrithik Roshan Support Aamir Khan Movie - Sakshi

ప్రస్తుతం బాలీవుడ్‌కు బాయ్‌కాట్‌ సెగ అట్టుకుంది. నిన్న మొన్నటి వరకు మిస్టర్‌ ఫర్ఫెక‌్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ సినిమాలను బహిష్కరించాలంటూ సోషల్‌ మీడియాలో విసృత ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.  దేశంలో అశాంతి ఉందంటూ గతంలో ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు గాను నెటిజన్లు, పలు సంఘాలు ఆయనపై మండిపడ్డాయి. దీంతో ఆయన లేటెస్ట్‌ మూవీ లాల్‌సింగ్‌చద్ధాను బాయ్‌కాట్‌ చేయాలంటూ హ్యాష్‌ ట్యాగ్‌ను వైరల్‌ చేస్తున్నారు.

చదవండి: సింగర్‌ రాహుల్‌ జైన్‌పై అత్యాచారం కేసు

దీంతో తనని క్షమించాలని, తన చిత్రం చూడాల్సిందిగా ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశాడు ఆమిర్‌. అయినప్పటికి లాల్‌సింగ్‌ చద్ధా చూసేందుకు ఎవరు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ఆమిర్‌కు మరో స్టార్‌ హీరో మద్దతు ఇవ్వడంతో ఆయన సినిమాను సైతం బాయ్‌కాట్‌ చేయాలంటే ప్రచారం చేస్తున్నారు నెటిజన్లు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్‌ ‘గ్రీకువీరుడు’ హృతిక్‌రోషన్‌. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న హృతిక్‌ ఇటీవల ట్విట్టర్ వేదికగా ఆమిర్‌కు సపోర్ట్ చేశాడు. ‘ఇప్పుడే లాల్ సింగ్ చద్ధా చూశా.

ఈ సినిమా హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ప్లస్‌లు, మైనస్‌లను పక్కన పెడితే ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంది. దీన్ని అస్సలు మిస్ చేయకండి, ఇప్పుడే వెళ్లి సినిమా చూడండి’ అని ట్వీట్‌ చేశాడు. దీంతో నెటిజన్లు ఆయనపై విరుచుపడుతున్నారు. ద కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా చూడాలని అప్పుడేందుకు ట్వీట్‌ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదంటూ హృతిక్‌పై మండిపడుతున్నారు. అంతేకాదు ఆయన తదుపరి చిత్రం విక్రమ్‌ వేదను బహిష్కరించాలంటూ హృతిక్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ‘బాయ్‌కాట్‌విక్రమ్‌వేద’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.

చదవండి: చాలా కష్టాలు పడ్డా.. జీవితం చాలా పాఠాలు నేర్పింది: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement