టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఎంత ఫేమస్సో.. అతని పిల్లలు కూడా అంతే పాపులారిటీ సంపాదించుకున్నారు. వీళ్ల అల్లరి వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో సార్లు వైరల్‌గా మారాయి. ఇక ఈ మధ్యే అల్లు అర్హ నిఖిల్ 18 పేజీస్ చిత్రం ముహూర్త కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా వెళ్లి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా అయాన్‌కు కూడా పిలుపు వచ్చింది. కానీ ఈ సారి దక్షిణాది నుంచి కాకుండా బాలీవుడ్ నుంచి స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. అది కూడా అతనికి ఎంతో ఇష్టమైన బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నుంచి. అయాన్‌కు అతని సినిమాల్లో ఫైటింగ్ సీన్లు, యాక్షన్ మూమెంట్స్‌ను దగ్గర నుంచి చూడాలనుందట. దీంతో ‘టైగర్ స్క్వాష్.. నన్ను సెట్స్‌కు పిలవ్వూ’ అంటూ ముద్దుముద్దుగా మాట్లాడుతున్న వీడియోను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
దీనికి అల్లు అర్జున్ నవ్వుతూ ఎందుకు అని అడిగితే.. ‘అతని గన్ ఫైటింగ్ సీన్లు చూడాలనుంద’ని తెలిపాడు. ఈ వీడియో కాస్తా హీరో టైగర్ ష్రాఫ్ కంట్లో పడింది. వెంటనే దానికి రిప్లై ఇస్తూ ‘నా కొత్త పేరు ఎంతగానో నచ్చింది. అల్లు అర్జున్ సర్.. అయాన్ కేవలం భాగీ షూటింగ్‌కే కాదు.. ఏ సినిమా షూటింగ్స్‌కైనా రావచ్చు’ అని తెలిపాడు. కాగా టైగర్ ప్రస్తుతం హాలీవుడ్ సినిమా ‘రాంబో’ రీమేక్‌లో నటిస్తున్నాడు. వార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ హీరో 2014లో వచ్చిన ‘హీరో పంటి’ చిత్రంతో కెరీర్ ప్రారంభించాడు. ఇది బన్నీ హిట్ సినిమాల్లో ఒకటైన ‘పరుగు’ రీమేక్ కావడం విశేషం.
బాలీవుడ్ హీరోకు నిక్‌నేమ్ పెట్టిన అల్లు అయాన్
Published Tue, Mar 17 2020 2:10 PM | Last Updated on Tue, Mar 17 2020 3:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment