ముంబై : బాలీవుడ్ స్టార్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీ డేటింగ్ చేస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా...ఇద్దరూ కలిసి హాలీడేలు, డిన్నర్‌లు, పార్టీలు అంటూ బీ-టౌన్ రోడ్లపై చక్కర్లు కొడుతూ మీడియా కెమెరాలకు చిక్కుతుంటారు. దీంతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా టైగర్ ష్రాఫ్ తన 31వ పుట్టినరోజు వేడుకలను ముంబై బాంద్రాలోని ఓ స్టార్ హోటల్‌లో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్న ఈ బర్త్‌డే వేడుకల్లో ఆయన గర్ల్‌ప్రెండ్ దిశా పటానీ కూడా కనిపించింది. దీంతో ఫ్యామిలీకి సమానమైన రిలేషన్ దిశాతో ఉందంటే ఇక వీరిద్దరూ మరికొద్ది రోజుల్లోనే పెళ్లి పట్టాలెక్కనున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ పార్టీలో దిశా- టైగర్ కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టైగర్ ష్రాఫ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తల్లి అయేషా ష్రాఫ్, సోదరి కృష్ణ ష్రాఫ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నటుడి చిన్ననాటి ఫోటోలను షేర్ చేశారు. దిశా పటానీ సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియుడికి బర్త్‌డే విషెస్ తెలిపింది. ఇదిలా ఉండగా, టైగర్ ష్రాఫ్ గతేడాది శ్రద్ధాతో కలిసి నటించిన బాఘి-3 సినిమా విజయవంతం అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన వికాస్ దర్వకత్వంలో తెరకెక్కనున్న 'గణపత్' సినిమాలో నటించనున్నాడు. ఇక దిశా దిశా పటానీ సల్మాన్ ఖాన్ సరసన నటించిన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' సినిమా ఈ ఏడాది ఈద్ పండగ నాడు రిలీజ్ కానుంది.ఇదిలా వుంటే దిశా పటానీ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ సరసన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'లో నటించింది. ఈ చిత్రం ఈద్ పండగ నాడు రిలీజ్ కానుంది. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించాడు.
చదవండి : (Disha Patani: ఫోటోకు స్టార్ హీరో కామెంట్)
(మాల్దీవుల్లో పెళ్లిలో 'సాహో' హీరోయిన్!)
Comments
Please login to add a commentAdd a comment