
ముంబై: బాలీవుడ్ అందాల నటి దిశా పటానికి చేదు అనుభవం ఎదురైంది. తన 26వ పుట్టిన రోజు సందర్భంగా దిశా తరుచూ వెళ్లే బేస్టియన్ రెస్టారెంట్‌కి.. తన బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్‌తో కలిసి వెళ్లింది. అయితే ఆమె రాక తెలుసుకున్న దిశా అభిమానులు.. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకోడానికి అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. వారంతా ఒక్కసారిగా దగ్గరికి రావడంతో ఆమె కిందపడబోయారు. దీంతో వెంటనే తేరుకున్న ష్రాఫ్ ఆమె పడకుండా చేయిపట్టుకుని రక్షించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టైగర్ ష్రాఫ్‌తో పాటు సన్నిహితుల మధ్య దిశా పుట్టిన రోజును జరుపుకున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ ‘భారత్’ మూవీలో దిశా పటాని నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.