స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాకు సీక్వల్‌గా ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌లో మ్యాన్లీ హంక్ టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నాడు. పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరిలో జరగుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టైగర్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్న తారా సుతారియా, అనన‍్య పాండేలు షూటింగ్ సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు.