![Bollywood Star Tiger Shroff Gets Angry At Fan Question Over Instagram - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/11/tiger.jpg.webp?itok=da3ziTky)
ముంబై : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ ఫైటింగ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌కు ఓ అభిమాని ప్రశ్నకు చిర్రెత్తుకొచ్చింది. అభిమానులతో సరదాగా గడిపేందుకు టైగర్ ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం రాత్రి ఓ కార్యక్రమం మొదలెట్టాడు. అయితే ఓ ఆకతాయి .. ‘ఇంతకూ మీరు వర్జినా’ అని ప్రశ్నించాడు. దీంతో టైగర్ కాస్త కలవరపడ్డాడు. వెంటనే తేరుకుని.. ‘ఓ సిగ్గులేని వెధవ. ఇన్‌స్టాలో మా అమ్మానాన్నా కూడా నన్ను ఫాలో అవుతున్నారు’అని ఘాటుగా స్పందించాడు.
ఇక మరో అభిమాని ‘మీకు ఎంతమంది గాళ్‌ఫ్రెండ్స్’అని ప్రశ్నించగా.. ‘చెప్పడానికేం లేదు. గాళ్‌ఫ్రెండ్స్ లేరు’అంటూ బదులిచ్చాడు. ఇక భాగి-2 సినిమాలో తనతో జోడి కట్టిన దిశా పటానితో టైగర్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరిదీ హాట్ జోడీ అని బీ-టౌన్‌లో ప్రచారం సాగుతోంది. ‘మీరు దిశాతో డేటింగ్‌లో ఉన్నారా..?’అని ఓ అభిమాని అడగ్గా.. ‘చెబితే వినకుంటే నేనేం చేయలేను. ఐ డోంట్ కేర్’అన్నాడు. తమ మధ్య ఉన్న బంధాన్ని టైగర్, దిశా ఇంతవరకూ బయటపెట్టకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment