
బాలీవుడ్ స్టార్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీ డేటింగ్ చేస్తున్నారని గత కొంతకాలంగా బీ-టౌన్‌లో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హాలీడేలు, డిన్నర్‌లు, పార్టీలు అంటూ తిరుగుతూ ఆ వార్తలను మరింత బలోపేతం చేస్తున్నారు ఈ యంగ్ కపుల్. ఇలా బయట కలిసి కనిపిస్తూ ఉన్నా కూడా వీరిద్దరు తమ రిలేషన్‌షిప్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే రీసెంట్‌గా ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన దిశా పటానీ టైగర్ ష్రాఫ్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.
‘ మేమిద్దరం పని పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటాం. హార్డ్‌వర్క్ చేస్తాం. అయితే టైగర్ నా కంటే ఎన్నో రెట్లు అధికంగా శ్రమిస్తాడు. మా ఇద్దరికీ జీవితంలో కొన్ని ఆశయాలు, పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. టైగర్ పట్ల నాకెంతో ఆరాధనా భావం ఉంది. తను నా బెస్ట్ ఫ్రెండ్. ఇండస్ట్రీలో తను కాకుండా వేరే స్నేహితులెవరూ లేరు’ అని దిశా పేర్కొన్నారు. అంతేతప్ప తమ మధ్య ఉన్నది ప్రేమా? కేవలం స్నేహమేనా? అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు దిశా.
కాగా టైగర్ ష్రాఫ్-దిశా పటాని భాగీ 2 సినిమాలో జంటగా నటించారన్న సంగతి తెలిసిందే. టైగర్‌తోనే కాకుండా అతడి తల్లి అయేషా, చెల్లి క్రిష్ణతో కూడా దిశా తరచుగా బయటికి వెళ్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో.. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోందంటూ రూమర్లు ప్రచారం అవుతున్నాయి. ఇక వృత్తిగత విషయానికి వస్తే..సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్‌లతో కలిసి దిశా నటించిన భారత్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment