సాక్షి, ముంబయి : టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జంటగా అహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాగీ 2 బాక్సాఫీస్ వద్ద మోతమోగిస్తోంది. అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతూ 2018లో రెండో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. తొలిరోజు రూ 25.10 కోట్లు, రెండో రోజు రూ 20.40 కోట్లు వసూలు చేసిన బాగీ 2.. వీకెండ్ చివరి రోజైన ఆదివారం ఏకంగా రూ. 27.60 కోట్లు రాబట్టింది. మొత్తానికి మొదటి వారాంతంలో ఈ సినిమా రూ. 73.13 కోట్లు వసూలు చేసింది.
‘ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్..ప్రతిచోటా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ వసూళ్లతో దూసుకెళుతోంది. అసాధారణమైన ఓపెనింగ్ వసూళ్లు సాధించింది... మొత్తం రూ. 73.10 కోట్లు రాబట్టింది’ అని ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 2018లో బాలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ‘బాగీ-2’ రెండోస్థానంలో నిలిచిందని, భన్సాలీ ‘పద్మావత్’ సినిమా రూ. 114 కోట్లతో మొదటిస్థానంలో ఉందని ఆయన తెలిపారు. అయితే, ‘పద్మావత్’ సినిమా హిందీతోపాటు తమిళం, తెలుగు భాషలను కలుపుకొని ఈ మొత్తం కలెక్షన్లు రాబట్టిందని పేర్కొన్నారు. 2018 టాప్-5 ఓపెనింగ్ వసూళ్ల జాబితాలో రైడ్ (రూ. 41.01 కోట్లతో) మూడోస్థానంలో, పాడ్‌మ్యాన్ (రూ. 40.05 కోట్లతో) నాలుగో స్థానంలో, సోను కే టిటు కి స్వీటీ (రూ. 26.57 కోట్లతో) ఐదోస్థానంలో ఉందని తెలిపారు.
తెలుగులో వచ్చిన ‘క్షణం’సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ‘బాగీ-2’లో టైగర్ ష్రాఫ్ చేసిన రిస్కీ ఫైట్లు, అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. టైగర్‌ను ప్రశంసిస్తూ.. ఇప్పటికే బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్‌లు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment