అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌..! | Baaghi 2 trailer is trending | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 22 2018 9:08 AM | Last Updated on Thu, Feb 22 2018 12:01 PM

Baaghi 2 trailer is trending - Sakshi

దేశీ ర్యాంబో టైగర్‌ ష్రఫ్‌ మళ్లీ బాక్సాఫీస్‌ మీద దండయాత్రకు సిద్ధమవుతున్నాడు. ‘అతడే ఒక సైన్యం’గా విలన్ల భరతం పట్టబోతున్నాడు. ‘బాఘీ-2’తో  త్వరలోనే  ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. బాలీవుడ్‌ ప్రేమజంటగా పేరొందిన టైగర్‌ ష్రఫ్‌, దిశా పటానీ ఈ సినిమాలో మరోసారి జోడీ కట్టారు.

ఈ సినిమాలో దిశా నేహా పాత్ర పోషించగా.. ఆమె మాజీ ప్రేమికుడిగా టైగర్‌ ష్రఫ్‌ రోనీ పాత్రలో కనిపించనున్నారు. నేహా కూతురు కిడ్నాప్‌ అవుతుంది. తన కూతురిని కాపాడమంటూ నేహా రోనీని బతిమిలాడుకుంటుంది. ఆ చిన్నారిని కాపాడేందుకు బయలుదేరిన రోనీ చేసిన సాహసాలేమిటి? ఈ క్రమంలో విలన్లు, పోలీసులు, డ్రగ్స్‌ మాఫియా, దుష్టులను అతను ఎదుర్కొన్నాడన్నది ఈ సినిమా ఇతివృత్తంగా కనిపిస్తోంది.

తెలుగులో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన ‘క్షణం’ సినిమాకు ఇది రీమేక్‌.. మూలకథను యథాతథంగా తీసుకొని.. యాక్షన్‌ సీక్వెన్స్‌ను మరింత హైరేంజ్‌లో తీర్చిదిద్దినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ బుధవారం ఆన్‌లైన్‌లో రిలీజ్‌.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందులో ట్రైగర్‌ మరోసారి తన దేహధారుఢ్యంతో, అద్భుతమైన యాక్షన్‌ స్టంట్స్‌తో అదరగొట్టాడు. ‘వన్‌ మ్యాన్‌ ఆర్మీ.. అతడే ఒక సైన్యం’ అంటూ ట్రైలర్‌లోని డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ర్యాంబో, మిషన్‌ ఇంపాజిబుల్‌ తరహాలో హై యాక్షన్‌ సీక్వెన్స్‌..రిస్కీ ఫైట్స్‌ ట్రైలర్‌లో దర్శనమివ్వడంతో యాక్షన్‌ జానర్‌ అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement