
కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీపై పడింది. దీని దెబ్బకు పలు చోట్ల థియేటర్లు సైతం మూతపడ్డాయి. అంతేకాక పలు సినిమాల షూటింగ్‌లు, ప్రమోషన్ కార్యక్రమాలు, విడుదల వాయిదా పడ్డాయి. దీంతో సినిమా తారలు తమకు దొరికిన ఖాళీ సమయాన్ని ప్రజల కోసం వెచ్చిస్తున్నారు. జనాల్లో కరోనా భయాన్ని తొలగించి అవగాహన కల్పించేందుకు పూనుకున్నారు. అందులో భాగంగా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటూ కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఇందుకోసం బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్ రంగంలోకి దిగగా.. ఇప్పుడీ లిస్టులో భాగీ హీరో టైగర్ ష్రాఫ్ చేరాడు.
కరోనా గురించి ఓ పాజిటివ్ న్యూస్‌ను ఫొటోతో సహా అభిమానులకు షేర్ చేశాడు. ‘గొప్ప వార్త. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాదిగ్రస్తులు సగానికిపైగా కోలుకున్నారు. ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే వారు చనిపోవడం ఖాయం అనేది అపోహ. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే తిరిగి మామూలు స్థాయికి వచ్చేస్తారు’ అనేది ఆ పోస్టు సారాంశం. కాగా చైనాలోని వూహాన్‌లో బయటపడ్డ ఈ మహమ్మారి నానాటికీ వివిధ దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం చైనాలో ఈ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టగా ఇటలీ, ఇరాన్‌లో మాత్రం మృత్యు ఘంటికలు మోగిస్తోంది. (‘టైగర్, మీకు ఎంతమంది గాళ్‌ఫ్రెండ్స్’)
Comments
Please login to add a commentAdd a comment