దసరా సందర్భంగా లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటితో పాటే సందట్లో సడేమియా అన్నట్లు బాలీవుడ్ నుంచి 'గణపథ్' మూవీ కూడా రిలీజైంది. ట్రైలర్ రిలీజ్ కాగానే దీన్ని ప్రభాస్ 'కల్కి'తో దీన్ని పోల్చారు. తీరా చూస్తే డిజాస్టర్ కా బాప్ అనేలా టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ అయితే ఘోరం. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?
(ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు)
'గణపథ్' కథేంటి?
అది 2060 సంవత్సరం. ప్రపంచం రెండుగా విడిపోయుంటుంది. సిల్వర్ సిటీలో కేవలం ధనవంతులే ఉంటారు. ఇక్కడ మనుషుల కంటే రోబోలు, డ్రోన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. గరీబొంకి బస్తీలో పేదవాళ్లు మాత్రమే ఉంటారు. తమని కాపాడేందుకు గణపథ్ వస్తాడని వేయి కళ్లతో వీళ్లు ఎదురుచూస్తుంటారు. అయితే డబ్బునోళ్ల వైపు ఉన్న గణపథ్(టైగర్ ష్రాఫ్).. పేదవాళ్లవైపు ఎలా వచ్చాడు? అనేదే స్టోరీ.
ఎలా ఉంది?
ఈ డైరెక్టర్ ఎవడో గానీ సినిమాతో ప్రేక్షకులకు నరకం అంటే చూపించాడు. ట్రైలర్ చూసి అందరూ 'కల్కి'తో పోలికలు ఉన్నాయన్నారు గానీ అంత సీన్ లేదు. హాలీవుడ్ హిట్ మూవీస్ అయిన మ్యాడ్ మాక్స్, డ్యూన్, ఎలిసియం లాంటి సినిమాల్ని 'గణపథ్' కోసం డిటోకి డిటో దర్శకుడు కాపీ కొట్టేశాడు. అమితాబ్ లాంటి స్టార్‌ని ఒక్క శాతం కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఇక హీరో అయితే బాడీ ఉంది కదా అని అవసరమున్నా లేకపోయినా చూపిస్తూనే పోయాడు. అది అయితే చిరాకు తెప్పించింది. ఓవరాల్ గా థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకుడు.. చివరివరకు కూర్చుంటే గ్రేట్ అనేంత డిజాస్టర్ కా బాప్, పెద్ద కళాఖండం ఈ సినిమా. ఇకపోతే తొలిరోజు రూ 2.5 కోట్లు వచ్చాయి. టైగర్ ష్రాఫ్ కెరీర్ లో ఇది చాలా తక్కువ. అలా కూడా చెత్త రికార్డ్ సెట్ చేశాడీ హీరో.
(ఇదీ చదవండి: నోటికొచ్చింది వాగుతున్న శివాజీ.. మళ్లీ మంచోడిలా కవరింగ్!)
Comments
Please login to add a commentAdd a comment