
బాలీవుడ్ భామ దిశా పటాని నటనతోనే కాదు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌తోనూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. ఈరోజు 26వ పుట్టిన రోజు జరుపుకొంటున్న ఈ బ్యూటీ.. తాను ఆడంబరాలకు దూరంగా ఉంటానన్నారు. ఈ బర్త్‌డేకు ఎటువంటి ప్లాన్ చేయలేదని..ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘మలంగ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారన్నారు. ఇక హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా డేటింగ్‌లో ఉన్నారంటూ బీ- టౌన్‌లో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ఈ అమ్మడు.. శివసేన పార్టీ యువసేన అధ్యక్షుడు ఆదిత్యా థాక్రేతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో దిశా పటానీ తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘దిశా.. టైగర్‌ను వదిలేసి.. రియల్ టైగర్‌తో తిరుగుతుంది’ అని కొందరు.. ‘అయ్యో... టైగర్ బతికున్నాడా లేదా’ అంటూ మరికొందరు ట్రోలింగ్‌కు దిగుతున్నారు. అయితే తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉన్న ఈ ట్రోల్స్‌పై.. దిశా కాస్త ఘాటుగానే స్పందించారు. ‘ స్నేహితులతో డిన్నర్, లంచ్‌కి వెళ్తే తప్పేంటి? నా దృష్టిలో స్నేహితులు అంటే అర్థం ఒకటే. అది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సరే అంతా నాకు సమానమే. నేను ఎలాంటి లింగ వివక్షను చూపించను’ అని కౌంటర్ ఇచ్చారు. కాగా సల్మాన్ ఖాన్‌తో కలిసి దిశా నటించిన భారత్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల దుమ్ము లేపుతున్న ఈ సినిమాలో తాను కూడా భాగమవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment