Hritik Roshan & Tiger Shroff's War Movie Action Scenes Shot in 15 Main Cities of 7 Countries - Sakshi
Sakshi News home page

7 దేశాల్లోని 15 నగరాల్లో.. ‘వార్‌’

Published Wed, Aug 21 2019 10:04 AM | Last Updated on Wed, Aug 21 2019 11:53 AM

Action Scenes in War Shot in 7 Countries - Sakshi

బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌లు హృతిక్ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ చిత్రం వార్‌. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌లు పనిచేస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్‌ ప్రధానంగా సాగనుంది.

ఈ సినిమాలో పోరాట సన్నివేశాలను 7 దేశాల్లోని 15 ప్రధాన నగరాల్లో చిత్రీకరించారు. ఈ సన్నివేశాలను గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌కు పనిచేసిన పాల్‌ జెన్సింగ్స్‌ని, ఐ ఇన్‌ ద స్కై, డెత్‌రేస్‌ ఫేం ఫ్రాంజ్‌ స్పిల్హాస్‌, ఏజ్‌ ఆఫ్‌ ఆల్ట్రాన్‌, స్నో పియర్సర్‌ ఫేం సీ యంగ్‌ని, శాన్ ఆండ్రియాస్‌, టైగర్‌ జిందాహై, మేరీకోమ్‌, కేసరి చిత్రాల స్టంట్‌ మాస్టర్‌ పర్వేజ్‌ షేక్‌ నేతృత్వంలో చిత్రీకరించారు. కేవలం యాక్షన్ సీన్స్‌ను దాదాపు ఏడాది పాటు డిజైన్‌ చేశారు.

హృతిక్‌, టైగర్‌లు పోటాపోటిగా నటించిన ఈ సినిమా యాక్షన్‌ చిత్రాలను ఇష్టపడేవారికి విపరీతంగా నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement