
అనన్య పాండే (ఫైల్ ఫొటో)
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్- 2’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతోన్న అనన్య షూటింగ్‌లో గాయపడినట్లు సమాచారం. చిత్రీకరణలో భాగంగా అనన్య కారు నడుపుతుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొన్నారు. ఊహించని పరిణామానికి అనన్య షాక్ గురైనట్లు సమాచారం. అయితే అనన్యకు పెద్దగా గాయాలేమీ కాలేదని, అయినప్పటికీ చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు యూనిట్ సిబ్బంది తెలిపారు.
2012లో విడుదలైన సూపర్‌హిట్ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ సినిమాలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తుండగా అనన్య పాండే, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరిలో షూటింగ్ జరుగుతోంది.